హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రెడిబిలిటీ కోల్పోవద్దు.. రాజీనామా చేయ్, డీజీపీకి అర్వింద్ సవాల్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శల పరంపర కొనసాగుతోంది. ఇవాళ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనపై డీజీపీ అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కేసులు పెట్టమంటే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆయన విమర్శించారు. ఎఫ్ఐఆర్ అతిగా ఉందని కోర్టు కూడా తప్పుపట్టిందని, అనవసరంగా క్రెడిబిలిటీ కోల్పోవద్దని అన్నారు. చిత్తశుద్ధి ఉన్నట్టైతే కేసులు పెట్టాలని కేసీఆర్ చెబితే రాజీనామా ఆయన మొహాన కొట్టి బీజేపీలోకి రావాలని డీజీపీని ఉద్దేశించి అరవింద్ అన్నారు.

టికెట్ ఇస్తాం..

టికెట్ ఇస్తాం..

అంతేకాదు బీజేపీ మిమ్మల్ని రాజకీయ నాయకుడిని చేస్తుందని తెలిపారు. టికెట్ కూడా ఇస్తుందని ఆయన హామీనిచ్చారు. ఏడాదిన్నరలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అవుతుందని చెప్పారు. మహిళా టీచర్ చనిపోతే చూడటానికి కూడా రాని కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవీ అవసరమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని విమర్శించే స్థాయి కవితది కాదని అన్నారు.

టీఆర్ఎస్ తొత్తు..

టీఆర్ఎస్ తొత్తు..

డీజీపీ మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారని అర్వింద్ ఆరోపణలు చేశారు. మహేందర్ రెడ్డి లాంటి వారి వలనే పోలీస్ శాఖ నాశనం అవుతోందని కామెంట్ చేశా రు. సీఎం కేసీఆర్‌కు మహేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాగుబోతు ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ కార్యకర్తలు తాగుబోతులు అని అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని బీజేపీ ఎంపీ అర్వింద్ పరామర్శించారు.

Recommended Video

Assembly Elections 2022: Opinion Poll హోరాహోరీ పోరే | ABP-CVoter | Oneindia Telugu
టెన్త్ నుంచే మెరిట్ స్టూడెంట్

టెన్త్ నుంచే మెరిట్ స్టూడెంట్

సరస్వతి టెన్త్ నుంచే మెరిట్ స్టూడెంట్ అని.. ఆమెకు ఆనాడే తాము ఉన్నత విద్య కోసం సాయం చేశామని చెప్పారు. ఇక్కడ ఆమె టీచర్‌గా పనిచేస్తుంటే.. భర్త ఖతార్‌లో డ్రైవర్‌గా పని చేసి డబ్బులు పంపుతున్నారని వివరించారు.. గాడిన పడుతున్న మధ్య తరగతి కుటుంబాన్ని బదిలీ పేరుతో ఛిన్నాభిన్నం చేశారని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

English summary
bjp nizamabad mp arvind asks to dgp resign his job and join the bjp. party will give the ticket he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X