హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

KTR With Satya Nadella: సత్య నాదెళ్ల‌తో కేటీఆర్ భేటీ.. బిర్యానీపై చర్చ..!

|
Google Oneindia TeluguNews

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌ను.. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క‌లిశారు. ఈ మేరకు కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. ఇద్ద‌రు హైద‌రాబాదీలు క‌ల‌వ‌డం శుభ‌దినం అవుతుంద‌ని మంత్రి కేటీఆర్ త‌న పోస్టులో పేర్కొన్నారు. స‌త్య నాదెళ్ల‌తో బిజినెస్‌, బిర్యానీ గురించి చ‌ర్చించిన‌ట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌లో వివరించారు. మైక్రోసాఫ్ట్ తన నాల్గవ క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

చాట్‌జిపిటి

చాట్‌జిపిటి

ప్ర‌స్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల ఇండియా టూర్‌లో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయ‌న ప్ర‌ధాని మోడీని క‌లిశారు. బెంగళూరులో జరిగిన సమ్మిట్ లో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన చాట్‌బాట్ రోబో చాట్‌జిపిటిని సత్య నాదేళ్ల ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్‌షిప్ సమ్మిట్ లో సాంకేతికత ప్రాముఖ్యత, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది అనే దానిపై సత్య నాదేళ్ల మాట్లాడారు.

సౌత్ ఇండియ‌న్ టిఫిన్స్

సౌత్ ఇండియ‌న్ టిఫిన్స్

సత్య నాదేళ్ల చాట్‌జిపిటితో చాట్ చేశారు. పాపుల‌ర్ ద‌క్షిణ భార‌త అల్ఫాహారాల జాబితా ఇవ్వ‌మ‌ని కోరితే.. చాట్ జిపిటి ఇడ్లీ వ‌డ‌, దోశ‌ల‌తోపాటు బిర్యానీని సౌత్ ఇండియ‌న్ టిఫిన్స్ జాబితాలో చూపెట్టిందని చెప్పారు. ఈ జాబితాతో తాను అంగీక‌రించ‌బోన‌ని స‌త్య‌నాదెళ్ల చెప్పారు. బిర్యానీ టిఫిన్ గా పేర్కొంటూ అవమానిచ్చొద్దని అన్నారు. వెంటనే చాట్‌జిపిటి సారీ చెప్పింది.

మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీస్‌

భారత్‌లోని కంపెనీలూ క్లౌడ్‌ సాంకేతికతను అధికంగా వినియోగించుకుంటున్నాయని సత్య చెప్పారు. టెక్నాలజీ రంగంలో పెను మార్పును క్లౌడ్‌ తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. క్లౌడ్‌ వల్ల 70-80 మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీస్‌ అయిన అజూర్‌ దేశంలో పుణె, చెన్నై, ముంబయి కేంద్రాలుగా అమలు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో నాలుగో రీజియన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

English summary
Microsoft CEO Satya Nadella.. Municipal and IT Minister KTR met. To this extent, KTR made a post on his Twitte
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X