హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముషారఫే మోకరిల్లాడు.. నువ్వెంత.. మంత్రి కేటీఆర్‌పై కేఏ పాల్ కస్సు బుస్సు

|
Google Oneindia TeluguNews

సిద్దిపేటలో కేఏ పాల్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. స్వతహాగానే పాల్ అంటే కోపం, అసహనం ఎక్కువే.. ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తాను అంతర్జాతీయ మత ప్రబోధకుడినని చెబుతూనే.. తన ముందు నియంతలే మోకరిల్లారని గుర్తుచేశారు. అలాంటిది మీరెంత అని కామెంట్ చేశారు.

నియంతలా..?

నియంతలా..?


కేసీఆర్, కేటీఆర్ డిక్టేర్ లా వ్యవహరిస్తున్నారని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తనపై సిరిసిల్ల ఎస్పీ సహాయంతో దాడికి ప్లాన్ చేశాడని ఆరోపించారు. దీనికి సంబంధించి సెంట్రల్ హోం మినిస్ట్రీకి ఫిర్యాదు చేయమని ఓ యూనియన్ మినిస్టర్ 36 గంటల్లో ఏడు సార్లు కాల్ చేశాడని పేర్కొన్నారు. ఇంత జరుగుతుంటే ఫాంహౌస్‌లో కేసీఆర్ నిద్రపోతున్నాడని మండిపడ్డారు. డీజీపీని కలుస్తా అంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని, రెండు రోజులుగా డీజీపీని కలువకుండా హౌస్ అరెస్ట్ చేశారని పాల్ ఆరోపించారు.

వందలాది మంది పోలీసులు..?

వందలాది మంది పోలీసులు..?

తనను అడ్డుకోవడానికి వందలాది మంది పోలీసులను మోహరింపజేసి చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ గుండాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయబోతున్నట్లు తెలిపారు. డీజీపీ కార్యాలయం దగ్గర వెయ్యి మంది పోలీసులు తన కోసం మోహరిచారని, ఎవరూ లేనప్పుడు నన్ను ఎత్తుకుని పోవడానికి ట్రై చేస్తున్నారని ఆరోపించారు. ఖబడ్దార్ కేటీఆర్ ఎవరితో ఫైట్ చేస్తున్నావో తెలుసుకో, పది మంది డిక్టేర్ లాంటి దేశాధినేతలను మోకరించేలా చేశాను, ముషారఫ్ తన ముందు మోకరిల్లాడు, నువ్వెంత అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు.

టీఆర్ఎస్ ఓటమి ఖాయం..

టీఆర్ఎస్ ఓటమి ఖాయం..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని అన్నారు. 24 గంటల్లో డీజీపీ ఇక్కడికి వస్తే కలుస్తా లేదా రేపు హైకోర్టు లో లంచ్ మోషన్ వేస్తా అని పేర్కొన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే దానికి కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులు అని కామెంట్ చేశారు. తనకు ఎవరూ శత్రువులు లేరు కేసీఆర్, కేటీఆర్ తప్ప అంటూ పాల్ మండిపడ్డారు.

డీజీపీ కలువడం లేదు...?

డీజీపీ కలువడం లేదు...?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిన్న డీజీపీ కార్యాలయానికి బయల్దేరగా.. హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అపాయింట్ మెంట్ లేకుండా వస్తున్నారని సమాచారంతో పోలీసులు అమీర్ పేట్‌లో గల నివాసం వద్దే అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు పంపించలేదు. కేఏ పాల్ ఇంటి నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండొచ్చని వారు అంటున్నారు. మరోవైపు నిన్న రంజాన్ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయానికి రాలేదు. ఇంతలో పాల్ వెళ్లాలని అనుకోవడం.. అతని హౌస్ అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో మరో 24 గంటల సమయం ఇచ్చి.. తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తానని పాల్ తెలిపారు.

English summary
pakistan ex president musharraf is listening words, ktr is afteral prajasanti party chief ka paul alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X