మోడీ, అమిత్ షా పేరుతో దుర్మార్గాలు, ఉపేక్షించడం దేశ ఉనికికే ప్రమాదం: కేసీఆర్
8 ఏళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చి దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. రూపాయి విలువ పడిపోయిందన్నారు. నిరుద్యోగం తాండవిస్తోందని.. ఆకలి రాజ్యంగా మారుతోందని తెలిపారు. మునుగోడులో కూడా వెకిలి ప్రయత్నాలు చేశారు. చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్రచారాలు చేశారు. పాల్వాయి స్రవంతి తనను కలిసినట్టు, కొన్ని టీవీల పేర్లు పెట్టి ప్రచారం చేశారు.
ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా లెజిస్లేచర్, కార్యనిర్వహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, నాలుగోది మీడియా అని వివరించారు. వీటన్నింటిని పక్కన పెట్టేశారు. ఎవరినైనా బెదిరించగలం, ఏమైనా చేయగలం అని వారు అనుకుంటున్నారు. ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి. ఎవరు కూడా ఊహించలేరని కేసీఆర్ తెలిపారు.
ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం శ్రీ కేసీఆర్#LotusLeaks pic.twitter.com/xjEQ2kFhnE
— TRS Party (@trspartyonline) November 3, 2022
రాష్ట్రాల అభివృద్దికి ఆటంకంగా మారారని తెలిపారు. ప్రధాని మోడీకి తెలిసి జరుగుతుందో తెలియదు కానీ.. నివారించాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ ప్రధాని అయిన సమయంలోనే తాను సీఎం పదవీ చేపట్టానని తెలిపారు. 8 ఏళ్లలో ఏం చేశారని అడిగారు. దీనిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. మీ పేరు, అమిత్ షా పేరుతో దుర్మార్గం చేస్తున్నారని గుర్తుచేశారు.

చార్డెట్ విమానాల్లో తిరుగుతూ వారు వ్యవహారాలు చక్కబెడుతున్నారట.. ఆ వీడియోలు వారు చెప్పిందేనని కేసీఆర్ అన్నారు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దుర్మార్గాన్ని ఉపేక్షించడం దేశ ఉనికికి మంచిది కాదన్నారు. కొనుగోలు వ్యవహారంపై తాము పోరాటం చేస్తున్నామని.. తమతో ప్రజలు నడవాలని కేసీఆర్ కోరారు.












Click it and Unblock the Notifications