హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబులకు షాక్: బరిలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్: సర్‌ప్రైజ్ విజిట్: తాగి బండి నడిపితే..అంతే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి మందుబాబులు చేస్తోన్న ప్రయత్నాలకు పోలీసులు చెక్ పెట్టారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి నడి రోడ్డు మీద హంగామా చేసే మద్యం ప్రియుల జోరుకు కళ్లెం వేశారు. మందుతాగి బండి నడిపినా.. రోడ్డు మీద సందడి చేసినా.. ఇక అంతే సంగతులు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో న్యూ ఇయర వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రస్తుత సమయంలో తాగి బండి నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలను తీసుకోనున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలో వైసీపీ: స్టార్ క్యాంపెయినర్లు: యంగ్ లీడర్లకే బాధ్యతలు?తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలో వైసీపీ: స్టార్ క్యాంపెయినర్లు: యంగ్ లీడర్లకే బాధ్యతలు?

డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిరోధించడానికి

డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిరోధించడానికి

కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసకోకుండా ఉండటానికి హైదరాబాద్,సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చెపట్టారు. బుధవారం రాత్రి నుంచే తనిఖీలను ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లను నిరోధించడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో ట్రాఫిక్ పోలీసులను మాత్రమే కాదు.. ఇతర విభాగాల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్, క్రైమ్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మోహరింపజేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని దాాదాపు అన్ని ప్రధాన మార్గాల్లోనూ తనిఖీలను చేపట్టారు.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

సజ్జనార్.. సర్‌ప్రైజ్ విజిట్..

సజ్జనార్.. సర్‌ప్రైజ్ విజిట్..

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలను చేపట్టడం.. దీనికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన పలుచోట్ల ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. సైబరాబాద్ లిమిట్స్‌లో మొత్తం 124 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఆయా చోట్ల ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. బ్లాక్ స్పాట్లలో రోడ్ల మరమ్మతు కోసం సంబంధిత శాఖలకూ ఇదివరకే లేఖలను రాశారు.

2020లో 600లకు పైగా

2020లో 600లకు పైగా

ఈ ఏడాదిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మొత్తం 625 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాత్రివేళ.. మందు కొట్టి మితిమీరిన వేగంతో బైక్‌లను నడుపుతూ మందుబాబులు తాము ప్రమాదానికి గురి కావడమే కాకుండా.. ఇతరులను కూడా ఆసుపత్రులపాలు చేస్తున్నట్లు గుర్తించారు. అందుకే- కొత్త ఏడాది ఆరంభం నుంచే మందుబాబులకు కళ్లెం వేయడంతో పాటు ప్రమాదాలను నివారించడానికి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్. మద్యం తాగి వాహనాలను నడిపే వారిని టెర్రరిస్టులతో పోల్చిన సజ్జనార్ స్వయంగా బరిలోకి దిగారు..

లైసెన్స్ రద్దు..

లైసెన్స్ రద్దు..


డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారి లైసెన్స్‌లను రద్దు చేయడానికీ పోలీసులు వెనుకాడట్లేదు. 1988 మోటార్ వాహన చట్టం ప్రకారం..వారిపై కేసు నమోదు చేస్తామని సజ్జనార్ ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు. ఛార్జిషీట్‌ను సైతం నమోదు చేస్తామని, మందుబాబులను న్యాయస్థానం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. తాము చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌ను డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రికి మాత్రమే పరిమితం చేయట్లేదని పోలీసులు చెబుతున్నారు. ఏడాది మొత్తం కొనసాగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మున్ముందు మరింత పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

English summary
Cyberabad Police Commissioner VC Sajjanar makes a surprise visit to Traffic Check Posts along with Cyberabad DCP Traffic SM Vijay Kumar and other traffic police officials to curb the Drunk n Drive. They made a surprise visit to all the traffic check posts of Cyberabad region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X