Hydra: హైడ్రాపై కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ..

హైదరాబాద్ లోని చెరువులు, పార్కుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనుకున్నట్లుగానే హైడ్రా దూసుకెళ్తోంది. అక్రమార్కులకు చుక్కులు చూపిస్తూ ఆక్రమణలను కూల్చివేసింది. దీంతో చాలా చోట్ల చెరువులను హైడ్రా రక్షించింది. ముఖ్యంగా అమీన్ పూర్ లో కూల్చివేతలు, నల్ల చెరువు వద్ద కూల్చివేతలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మారుమోగింది. ఇంకా చెరువు బఫర్, ఎఫ్టీఎల్ నిర్మాణాలు ఉన్నాయి. వాటిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అలాగే మూసీ పరివాహకంలో ఉన్న ఆక్రమణలను కూడా తొలగించే పనిని హైడ్రాకు అప్పగించారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసు నమోదు చేసింది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు ఫైల్ చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సి 16063/ఐఎన్/2024 నంబర్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది.

NHRC has registered a case against Hydra in connection with the woman s suicide

సెప్టెంబర్ 27న కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ తన ఇంటిని హైడ్రా కూల్చివేస్తుందనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎలా చనిపోయినా హైడ్రా వల్ల చనిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హైడ్రా పేర్కొంది. ఆత్మహత్యకు ఏజెన్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని హైడ్రా వివరించింది. ఆమె తన కుమార్తెలకు కట్నంగా రెండు G+1 ఇళ్ళ, బహిరంగ ప్లాట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ నిర్మాణాలన్నీ బఫర్ జోన్ కిందకు వస్తాయని, కానీ మేము ఆ నిర్మాణాలను తాకడం లేదని హైడ్రా స్పష్టం చేసింది. అయితే కొందరు స్థానికులు హైడ్రాను రాక్షసంగా చూపించి ఆమెను భయపెట్టారని.. హైడ్రా అంటే రాక్షసుడు కాదుని.. భరోసా అని రంగనాథ్ స్పష్టం చేశారు. మహిళ మృతి పట్ల కమిషనర్ విచారం వ్యక్తం చేశారు. బుచ్చమ్మ ఇల్లు కూకట్‌పల్లి ప్రధాన రహదారిపై బీజేపీ పార్టీ కార్యాలయానికి సమీపంలో ఉందని కూకట్ పల్లి సీఐ పేర్కొన్నారు. అక్కడ కూల్చివేతకు హైడ్రా మార్కింగ్ లేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+