హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ అంటే లెక్కలేదా.. ప్రోటోకాల్ అమలు చేయరా..? రేణుకా చౌదరి నిప్పులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వర్సెస్ ప్రభుత్వం మధ్య పొసగడం లేదు. సీఎం కేసీఆర్ అంటే తమిళి సై బాహాటంగానే స్పందించడం.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విమర్శించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. గవర్నర్ ప్రొటొకాల్ ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశాయి. దీనిపై కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి స్పందించారు.

ప్రోటోకాల్ అమలవడం లేదు..

ప్రోటోకాల్ అమలవడం లేదు..


రాష్ట్రంలో గవర్నర్ ప్రోటోకాల్ అమలు కావడం లేదని మండిపడ్డారు. గవర్నర్ పర్యటనకు సెక్యూరిటీ కల్పించడం లేదన్నారు. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారని రేణుకా విమర్శించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిందితుడిగా ఉన్నా.. ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆమె నిలదీశారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన గవర్నర్ హోదాను అవమానానికి గురిచేస్తున్నారని విమర్శించారు.

అక్కడ కూడా నో సెక్యూరిటీ..

అక్కడ కూడా నో సెక్యూరిటీ..


నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు గవర్నర్‌ వెళ్తే కనీసం సెక్యూరిటీ కల్పించరా? ఐఏఎస్, ఐపీఎస్‌లకు రాజకీయాలతో ఏం సంబంధం? గవర్నర్ పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం అధికారులు హాజరు కావాల్సిందేనని స్పష్టంచేశారు. గవర్నర్ మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని.. సంస్కారం ఉన్న వాళ్లు చేసే పనులు కావన్నారు.

పువ్వాడ ఏ1

పువ్వాడ ఏ1


బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్ ఏ1 నిందితుడు.. అయినా అతడిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. మంత్రి పువ్వాడకు, కేటీఆర్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అందుకే పువ్వాడపై ఎలాంటి చర్యలు లేవన్నారు. పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంటే ఏసీపీకి సంబంధం లేదా? ఈ కేసులో ఏసీపీ కూడా నిందితుడేనని చెప్పారు. ఖమ్మంలో బీజేపీ నేతలతోపాటు, కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పీడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలిచ్చినా అమలు కావడం లేదు.

రేవంత్‌కు వెల్ కం

రేవంత్‌కు వెల్ కం


రేవంత్ రెడ్డిని ఖమ్మం రాకుండా ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. తనే దగ్గరుండి తీసుకెళ్తా.. రేవంత్ కోసం ఖమ్మం ఎదురు చూస్తోందన్నారు. భట్టి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పాదయాత్రకు తనను ఆహ్వానించలేదన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇప్పటివరకు తనను కలవలేదని.. పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం అని చెప్పారు.

English summary
no protocol on telangana governor tour congress leader renuka choudary alleged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X