'జై భీమ్'కు అన్యాయం జరిగిందా..?
2021-22 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ సినిమాలకు సంబంధించిన అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు తమ సత్తాను చాటాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, వంటి పెద్ద సినిమాలతో పాటు, ఉప్పెన, వంటి చిన్న సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది.బెస్ట్ యాక్టర్‌తో పాటు, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా పలు క్యాటగిరీల్లో తెలుగు సినిమాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి.బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ ఎంపికైయ్యారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమాకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు లభించింది.

2021లో విడుదలైన 'పుష్ప' మొదటి పార్ట్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజంకు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. హిందీలోనే ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఇదిలా ఉంటే తమిళ హీరోగా నటించిన ' జై భీమ్' సినిమాకు అన్యాయం జరిగిందని తమిళులు ఆరోపిస్తున్నారు. సామాజిక చైతన్యం నేపథ్యంలో తెరకెక్కిన 'జై భీమ్' సినిమాకు ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడంపై తమిళ తంబీలు ఆగ్రహంగా ఉన్నారు.

జస్టిస్ట్ చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'జై భీమ్' సినిమాలో సూర్య హీరోగా నటించారు. సూర్యతో పాటు లీడ్ రోల్స్‌లో నటించిన యాకర్ట్స్ తమ యాక్టింగ్‌తో మెప్పించారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. కాని ఒక్క విభాగంలో కూడా ఈ సినిమాకు అవార్డు రాకపోవడంపై సినీ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 'జై భీమ్' విషయం అన్యాయం జరిగిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పుష్పలో అల్లు అర్జున్ ఫర్మెమెన్స్ కన్నా జై భీమ్‌లో సూర్య నటన అద్భుతంగా ఉంటుందని ..సూర్యకు ఇవ్వాల్సిన అవార్డును అల్లు అర్జున్‌కు ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు.ఇక తమ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడంపై 'జై భీమ్' చిత్ర యూనిట్ మాత్రం నోరు మెదపడం లేదు.












Click it and Unblock the Notifications