Nota votes: గ్రేటర్ హైదరాబాద్‍లో నోటాకు తగ్గని ప్రాధాన్యం.. పలు చోట్ల నాలుగో స్థానం..
గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి అధిక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయినప్పటికీ ఇక్కడ నోటా కూడా భారీగా ఓట్లు పోలయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీల తర్వాతి స్థానంలో నోటా నిలిచిందంటే.. అభ్యర్థుల వ్యతిరేకత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో నోటాకు15,418 ఓట్లు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 12,824 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో 16,222 ఓట్లు నోటాకు వచ్చాయి.
నియోజకవర్గాల వారీగా చూస్తే కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా నోటాకు 4,079 ఓట్లు రాగా, అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లు వచ్చాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రేటర్ లో నోటాకు ఓట్లు కొంత తగ్గాయి. గతంలో పోలిస్తే 471 ఓట్లు తగ్గిట్ల ఎన్నికల ఫలితాలు బట్టి తెలుస్తోంది. నోటాకు కొన్ని చోట్ల వేలల్లో ఓట్లు వచ్చాయి. మేడ్చల్లో 3,737 ఓట్లు, శేరిలింగంపల్లిలో 3,145, ఎల్బీనగర్లో 2,966, మల్కాజ్ గిరిలో 2,608, కూకట్పల్లిలో 2,458, ఉప్పల్లో 2,536, మహేశ్వరంలో 2,031 ఓట్లు వచ్చాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేలలోపు నోటాకు పడిన సెగ్మెంట్లు 10 ఉండగా, ఐదొందల నుంచి వేయిలోపు పడిన సెగ్మెంట్లు 6 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎల్బీనగర్లో నోటా 45 మందిని వెనక్కి నెట్టి 4వ స్థానం దక్కించుకుంది. ఎల్బీనగర్ లో మొత్తం 48 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎల్ బీ నగర్ లో బీఆర్ఎస్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ నుంచి సామ రంగా రెడ్డి రెండో స్థానంలో, కాంగ్రెస్ నుంచి మధు యాష్కీ గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2,966 ఓట్లతో నోటా నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే మల్కాజ్ గిరిలో 33 మంది, ఉప్పల్లో 32 మంది, శేరిలింగంపల్లిలో 31 మంది బరిలో ఉండగా, అనూహ్యంగా నోటా నాలుగవ స్థానంలో నిలిచింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు 76,218 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ కు 75,950 ఓట్లు వచ్చాయి. కేవలం 268 ఓట్ల అతిస్వల్ప మెజారిటీతో కాలె యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడ నోటాకు1,423 ఓట్లు రావడం గమనార్హం. మెజారిటీ కంటే 1100 ఓట్ల నోటాకు వచ్చాయి.












Click it and Unblock the Notifications