Numaish 2024: జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం..
ప్రతి సంవత్సరం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈసారి కూడా 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1న నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. ఈ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది.
దాదాపు 46 పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. ఎగ్జిబిషన్ సొసైటీ ఎలాంటి భద్రత పరమైన లోపలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. పోలీస్ శాఖతో కలిసి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఎగ్జిబిషన్ లో సుమార్ 2,400 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

ఎగ్జిబిషన్‌లో ఒకే చోట అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండనున్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు చాలా మంది ప్రజలు వస్తుంటారు. నగరంలో అందుబాటులో లేని అనేక రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉండడంతో భారీగా జనాలు వచ్చే అవకాశం ఉంది. దుస్తులు, మంచాలు, వంట సామాగ్రి, మహిళల కోసం వంటసామగ్రి, దుప్పట్లు, బెడ్‌షీట్లు, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త ఫర్నిచర్, మల్టీ పర్పస్ ఉపకరణాలు ఎగ్జిబిషన్ లో ఉంటాయి.
ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ ను సుమార్ 22 లక్షల మంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులను గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద భద్రత సిబ్బంది మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి పంపిస్తారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సోసైటీ పోర్కొంది.
మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతూ విద్యావ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నామని తెలిపింది.












Click it and Unblock the Notifications