Hydra: మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్న అధికారులు.. ఇక కూల్చుడే..!

హైదరాబాద్ లో హైడ్రా దూసుకెళ్తోంది. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. కేవలం వాణిజ్య కార్యకలాపాలు జరిగే నిర్మాణాలను కూల్చివేస్తోంది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లో ఉన్న నివాసం ఉంటున్న గృహాలను కూల్చివేయడం లేదు. కొత్త నిర్మిస్తున్న ఇళ్లు, అలాగే కమర్షియల్ బిల్డింగ్ లనే కూల్చి వేస్తున్నారు. దీంతో అక్రమార్కులు భయపడిపోతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమైంది.

ఈ పనిని హైడ్రాకు అప్పగించింది. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి.. కూల్చాల్సిన నిర్మాణలకు మార్కింగ్ వేస్తోంది. పాతబస్తీ పరిధిలోని శంకర్ నగర్, చాదర్ ఘాట్, మూసానగర్ హైడ్రా అధికారులు మార్కింగ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. పలు చోట్ల బాధితుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. పోలీసులు వారికి సర్ది చెబుతున్నారు. కాగా మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణల్లో సర్వే చేసేందుకు ప్రభుత్వం 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

Officials have marked encroachments in Musi river catchment areas

ఈ బృందంలో ఒక తహసీల్దార్, ఐదుగురు అధికారులు ఉంటారు. కాగా మూసీని 55 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేయనున్నారు. నది పరివాహక ప్రాంతంలో ఇప్పటి వరకు 2166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ కూడా మూసీ అక్రమించి నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూంలు ఇవ్వనుంది. దీంతో పలు చోట్ల బాధితులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. అయితే వారికి కేటాయించే డబుల్ బెడ్ రూంలను ఇప్పటికే మంత్రులు పరిశీలించారు.

ప్రభుత్వం అనుకున్నట్లు మూసీలోని ఆక్రమణలను తొలగించి.. ప్రక్షాళన చేపడితే.. నది అందంగా మారే అవకాశం ఉంది. అయితే సింపుల్ విషయం ఏమీ కాదని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+