హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్: సిరిసిల్ల, జగిత్యాలలో టెన్షన్.. టెన్షన్...

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెన్షన్‌ పెడుతోంది. ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో తొలి ఒమిక్రాన్‌ కేసు వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 20వ తేదీన దుబాయ్‌ నుంచి ఓ వ్యక్తికి వేరియంట్ సోకింది. అతని కాంటాక్ట్ టెస్ట్ చేయగా.. బాధితుడి భార్య, తల్లి, స్నేహితులకు కూడా ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఒమిక్రాన్‌ భయంతో గ్రామస్తులు ఇప్పటికే గూడెం గ్రామంలో సెల్ఫ్ లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఎల్లారెడ్డి పేటలోని నారాయణపూర్ గ్రామంలో కూడా యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది.

జగిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లా

ఇటు జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ నమోదు అయ్యింది. షార్జా నుంచి మెట్‌పల్లికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ వచ్చింది. బాధితులను హైదరాబాద్‌లోని టిమ్స్‌కు తరలించారు. అటు ఒమిక్రాన్‌ భయంతో అనేక గ్రామాల్లో అధికారులు సెల్ఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

1525 కేసులు

1525 కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1525కి చేరగా.. 560 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ ,తెలంగాణ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి

మహారాష్ట్రలో ఎక్కువ

మహారాష్ట్రలో ఎక్కువ

మహారాష్ట్ర 460, ఢిల్లీ 351, గుజరాత్ 136, తమిళనాడులో 117, కేరళలో109, రాజస్థాన్ 69, తెలంగాణ 67, కర్ణాటక 63, హర్యానా 63, పశ్చిమ బెంగాల్ 29, ఏపీ 17, ఒడిశా 14, మధ్యప్రదేశ్ 9, ఉత్తరప్రదేశ్ 8, ఉత్తరాఖండ్ 8, చండిఘడ్ 3 జమ్మూకాశ్మీర్ 3, అండమాన్ నికోబార్ 2, గోవా 1, హిమాచల్ ప్రదేశ్ 1, లద్దాఖ్ 1,మణిపూర్ 1,పంజాబ్ 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.

రాత్రి కర్ఫ్యూ

రాత్రి కర్ఫ్యూ

చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కర్ఫ్యూ తప్ప మరో మార్గం లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

English summary
omicron virus feared in the karimnagar district. jagtial and rajanna sircilla district cases are came.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X