Gandhi Hospital:మారిన రూల్స్.. గీత దాటితే వేటు తప్పదు, ఇక సీరియస్..!
పేషెంట్‌ను చూసేందుకు వచ్చే బంధువులకు ఒకరిద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు
హైదరాబాదులో అతిపెద్ద సర్కారు దవాఖానాలు ఏవని అంటే మనకు ఎక్కువగా వినిపించే పేర్లు గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్. ఈ రెండు ప్రభుత్వ హాస్పిటళ్లు హైదరాబాద్ వాసులతో ముడిపడిపోయాయి. అంతేకాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఊళ్ల నుంచి కూడా ఇక్కడకు పేషంట్స్ వస్తుంటారు.ఇక్కడ లేని సదుపాయాలంటూ లేవు. ఇక గాంధీ హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది.పెద్ద చరిత్రే ఉంది.

1851లో ప్రారంభమై...
150 ఏళ్ల క్రితం 1851లో గాంధీ హాస్పిటల్ 3 వార్డులతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1900లో 95 పడకలతో కంటోన్మెంట్ హాస్పిటల్‌గా డెవలప్ అయ్యింది.1913లో కింగ్ ఎడ్వార్డ్ మెమోరియల్ హాస్పిటల్‌గా వృద్ధి చెంది 1958లో గాంధీ మెడికల్ కాలేజీగా ఆవిర్భావం చెందింది.ప్రస్తుతం 1200 పడకలతో ఈ ఆస్పత్రి నడుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన ఘనత గాంధీ హాస్పిటల్‌కే దక్కింది.డీఎం కార్డియాలజీ స్టూడెంట్స్‌కు తొలి క్యాథ్ లాబ్ కూడా గాంధీ హాస్పిటల్‌లోనే ఏర్పాటు కావడం విశేషం.

గాంధీ హాస్పిటల్ కీలక నిర్ణయం
ఎంతో చరిత్ర కలిగిన గాంధీ హాస్పిటల్ కాలక్రమంలో పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఎప్పుడూ పేషెంట్లు, పేషెంట్ల కుటుంబ సభ్యులు బంధువులతో కిటకిటలాడే గాంధీ హాస్పిటల్‌లో ఇక నుంచి ఈ రద్దీ కనిపించదు. ఎందుకంటే పేషెంట్‌తో పాటు ఒకరు లేదా ఇద్దరు కుటుంబ సభ్యులు లేదా బంధువులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ మేరకు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సార్లు ఐదారు మంది పేషెంట్ బంధువులు ఒకేసారి వచ్చి హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదంకు దిగుతున్నారని కొన్ని సందర్భాల్లో వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని దీన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ రాజారావు చెప్పారు.

డాక్టర్ రాజారాం ఏమన్నారంటే..
ఒక పేషెంట్ క్రిటికల్ కండీషన్‌లో హాస్పిటల్‌కు వస్తే డాక్టర్లు పేషెంట్‌ను పరిశీలించేందుకు తగిన సమయం ఇవ్వాలి. ఆ ప్రకారంగా చికిత్స జరిగేలా పేషెంట్ బంధువులు సహకరించాలి. ఎమర్జెన్సీ పద్ధతిలో వచ్చే పేషెంట్లు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారని అన్నారు. అంటే పేషెంట్‌తో పాటు వచ్చే బంధువుల నుంచే ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుందని వివరించారు.అయితే పేషెంట్‌తో పాటు వచ్చే బంధువులు ఈ విషయం చెప్పినా వినరని అన్నారు.ఈ క్రమంలోనే సిబ్బందిపై దాడులకు దిగుతున్నారని చెప్పారు.

పేషెంట్లను కలిసే సమయం
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే పేషెంట్లను చూసేందుకు అనుమతిస్తామంటూ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.గాంధీ హాస్పిటల్‌లో భద్రతను కూడా పెంచినట్లు చెప్పిన ఆయన.. ఎంట్రీ గేట్ వద్దే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారని వివరించారు. వార్డుల్లో ఉమ్మివేయడం,టాయిలెట్లను అపరిశుభ్రంగా మార్చడం వంటివి జరగకూడదనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. శానిటరీ వర్కర్ల సంఖ్యను పెంచడంతో ప్రస్తుతం వార్డులు, టాయ్‌లెట్స్ శుభ్రంగా ఉంటున్నాయని చెప్పారు. ఇక నుంచి గాంధీ హాస్పిటల్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సూచించారు.












Click it and Unblock the Notifications