ఇన్వెస్ట్‌మెంట్లు కేరాఫ్‌ తెలంగాణ - 150 శాతం వృద్ధి: అనూహ్యంగా..!!

తెలంగాణకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల్లోనేగాక.. ఉద్యోగావకాశాల్లోనూ తెలంగాణలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. 2020-21తో పోల్చితే 150 శాతం వృద్ధి సాధించినట్లు ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ నివేదికలో వెల్లడించింది. పెట్టుబడి దారుల్లో విశ్వాసం పెంపొందించటంతో పాటుగా కీలక రంగాల్లో సాధించిన పురోగతిని నివేదికలో స్పష్టం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా రాష్టంలో 17.53 లక్షల ఉద్యోగాలు లభించాయి.

పెట్టుబడులకు తెలంగాణ చిరునామాగా మారుతోంది. 'ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ తెలంగాణ' అంశంపై ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఓ అధ్యయనం చేసింది. ఇందులో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు లక్ష కోట్ల రూపాయలపైగా ఉన్నట్లు నిర్దారించారు. 2020-21తో చూస్తే 2021-22లో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల విలువ సుమారు 150 శాతం పెరగాయని నివేదిక తేల్చింది. 2014-15తో పోల్చితే 2021-22లో రాష్ట ఐటీ ఎగుమతులూ రెట్టింపు అయ్యాయని వివరించారు. 2020-21లో రూ. 31,274.56 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాగా.. 2021-22 సంవత్సరంలో రూ.76,568.89 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు నివేదిక పేర్కొంది.

Opinion: Investments flow into Telangana with 150 percent growth,all credits to KTR

ఇన్వెస్టర్లకు అనువైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని నివేదిక పేర్కొంది. పరిశ్రమలకు కావాల్సిన ప్రోత్సాహం..మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు సత్ఫలిలు ఇస్తోందని నివేదిక స్పష్టం చేస్తోంది. వైద్య రంగంలోనూ తెలంగాణ మెరుగైన ప్రగతిని కనబరుస్తున్నది. 2 లక్షల మంది వైద్య చికిత్స కోసం తెలంగాణకు వచ్చినట్టుగా నివేదిక వెల్లడించింది. వీరిలో ఎక్కువగా ఆఫ్రికా, గల్ఫ్‌ దేశాలు, కామన్‌వెల్త్‌ ఇండిపెండెంట్‌ దేశాల నుంచి వస్తున్నట్టుగా గుర్తించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చెయిన్‌, క్లౌడ్‌ అడాప్షన్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి భవిష్యత్తు ఉన్న అంశాల్లో తెలంగాణ ఎంతో ఆకర్షణీయ ప్రాంతంగా నిలిచిందని ఎంఎస్‌ఎంఈ ఈపీసీ చైర్మన్‌ డీఎస్‌ రావత్‌ పేర్కొన్నారు. -22లో ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.14,882.35 కోట్ల నుంచి రూ.60,618.05 కోట్లకు చేరుకున్నట్లుగా నివేదిక వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు వచ్చిన పెట్టబడులు..ఉపాధి కల్పన గురించి నివేదిక కీలక అంశాలను వెల్లడించింది. దేశ జీడీపీ 1.4 శాతం క్షీణతను చూసిన సమయంలో తెలంగాణలో ప్రతికూల పరిస్థితులను అధిగమంచి రాష్ట్ర జీడీపీ 2.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం.. పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతంగా నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రపంచంలోని టాప్‌-5 ఐటీ కంపెనీలు అమెరికా తరువాత తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఐటీ ఎగుమతులు 2014-15లో రూ.66,276 కోట్ల నుంచి 2021-22లో రూ.1,45,522 కోట్లకు రెట్టింపు అయ్యాయి. 2014-15లో ఉపాధి 3.71 లక్షల నుండి 2021-22 నాటికి ఐటీ రంగంలో 7 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12.4 శాతం వృద్ధి చెందగా.. 2021-22లో 9.09 శాతం వృద్ధిని సాధించాయి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, పాలసీ సపోర్టు వల్ల ఇది సాధ్యమైందని నివేదిక వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+