వలసకూలీల పాలిట వరం ‘అన్నపూర్ణ’:రోజుకు 1 లక్ష మందికి భోజనం, ఉచితంగానే అందజేత..
కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ కొనసాగడంతో వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పని లేదు. తినడానికి తిండి లేని పరిస్థితి. కొన్ని చోట్ల కార్మికులను యజమాన్యాలు జీతం ఇస్తున్న తినేందుకు తిండి లేదు. వీరి పాలిట జీహెచ్ఎంసీ 'అన్నపూర్ణ' వరంగా మారింది. రోజుకు లక్షమందికి వరకు ఉచితంగా భోజనం అందిస్తూ.. అన్నార్థుల ఆకలి తీరుస్తోంది.

2014లో 8 కేంద్రాల్లో..
2014లో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌తో కలిసి జీహెచ్ఎంసీ అన్న క్యాంటిన్ ప్రారంభించింది. 8 క్యాంటిన్లు క్రమంగా 150కి చేరాయి. అన్నం, సాంబార్, చట్నీ, వాటర్ ప్యాకెట్‌ను కేవలం రూ.5 కే అందిస్తున్నారు. ఇది కార్మికుల కడుపు నింపుతోంది. లాక్ డౌన్ వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష మందికి కడుపు నింపుతోంది. అదీ కూడా ఉచితంగా భోజనం అందిస్తూ..కడుపు నింపుతున్నారు.

వలసకూలీల వరం..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజు.. హైదరాబాద్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల అతని యజమాని జీతం ఇస్తున్నాడు. కానీ ఇతనికి వంట చేసుకునేందుకు సరైన సదపాయం లేదు. అందుకోసం గచ్చిబౌలి క్రాస్ రోడ్ వద్ద అన్న క్యాంటిన్ వద్ద ఉదయం, సాయంత్రం బాక్స్‌లో అన్నం తీసుకొని.. జీవిస్తున్నాడు.

క్లీన్‌గా..
ఉచితంగానే పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారని రాజు ప్రభుత్వాన్ని కొనియాడారు. లాక్ డౌన్ సమయంలో అన్న క్యాంటిన్ భోజనం అందజేయడంతో.. తాము జీవితం ఇచ్చినట్టవుతోందని రాజు పేర్కొన్నారు. తనలాంటి వారు చాలామంది భోజనం తీసుకొని.. జీవిస్తున్నారని పేర్కొన్నారు.

రోజుకు లక్షమంది..
లాక్ డౌన్‌కు ముందు ప్రతీ రోజు ఉదయం 45 వేల మందికి, సాయంత్రం 15 వేల మందికి భోజనం అందించేవారు. తర్వాత డిమాండ్ పెరగడంతో రోజుకు లక్ష మంది వరకు సరిపడ భోజనం అందిస్తున్నామని బల్దియా వర్గాలు తెలిపాయి. 450 రైస్, 100 గ్రాముల పప్పు, సాంబార్, చట్నీ అందిస్తున్నారు. నార్సింగిలోని వంటశాలలో వండి.. 150 కేంద్రాలకు పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో విజయవంతం అవడంతో వరంగల్, మహబూబ్ నగర్, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications