‘ఆ రెండింటిపై’ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడో షూటింగ్ ప్రారంభమై పడుతూ లేస్తూ సాగుతున్న హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ లో పాల్గొని ఆ సినిమాను సత్వరమే పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తిచేయాలని నిర్ణయించారు.
వాస్తవానికి ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఎన్నికలైన తర్వాతే జరుగుతాయని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతోపాటు ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉండటంతో ముందుగా హరిహరవీరమల్లు షూటింగ్ కు హాజరవుతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఉస్తాద్ సినిమాను పూర్తిచేయనున్నారు.

భారీ పీరియాడికల్ మూవీ కావడంతో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. అయినప్పటికీ కేటాయించిన కాల్షీట్ల ప్రకారం ఎన్నికల్లోపే ఈ సినిమాను పూర్తిచేసి విడుదల చేయాలని పవన్ భావిస్తున్నారు. దీంతో ఆయన షూటింగ్ కు హాజరవుతున్నారు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దర్శకుడు క్రిష్, నిర్మాత ఏం రత్నం షూటింగ్ ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు.
ఈ వార్త తెలియడంతో పవర్ స్టార్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలైన తర్వాతే పూర్తిచేస్తారని, అప్పుడే విడుదలవుతాయనే భావనలో ఇప్పటివరకు ఉన్నారు. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఎన్నికలకు ముందే విడుదల చేయాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో వారంతా ఖుషీ అవుతున్నారు. హరిహర వీరమల్లును పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దుతున్నారు క్రిష్. హైప్ కూడా ఎక్కువగా ఉండటంతో అంచనాలను అందుకునే విధంగా తమ హీరో సినిమా ఉండబోతోందని పవన్ అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications