భాగ్యలక్ష్మీ ఆలయానికి పోటెత్తిన భక్తులు: ఎందుకంటే.. దీపావళి సమయంలోనే ఇలా..
పాతబస్తీ భాగ్యలక్ష్మిదేవీ ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది. దీపావళి వేడుకలతోపాటు కార్తీక మాసం కోలాహలం మొదలైంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఖజానాను ప్రతి ఏడాది దీపావళికి వెండి నాణ్యం రూపంలో భక్తులకు పంపిణీ చేశారు. ఆ నాణ్యం తీసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని దర్శించుకోడానికి నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో దీపావళి వేడుకల సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ చేసినట్లు ఆలయ ట్రస్టీ శశికళ తెలిపారు.

ఇదీ నేపథ్యం..
హైదరాబాద్ చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. కాపలాదారులు అడ్డగించారు. దేవి తన గురించి చెప్పగా, ఆమెను లోపలికి రానివ్వడానికి అనుమతి కోసం రాజు దగ్గరకు వెళ్లారు. తాము వచ్చే వరకూ అక్కడే ఉండాలని సూచించారు.వారు తిరిగి వచ్చే వరకూ అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు. వెళ్లిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారు. తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి అని గుర్తించిన ప్రభువులు, ఆమె తిరిగి వెళ్లిపోతే రాజ్యంలో సిరిసంపదలు మాయం అవుతాయని ఆలోచించి, ఆమెను తిరిగి వెనక్కు పంపకుండా ఉపాయం ఆలోచించారు. ఆ కబురు తెచ్చిన కాపలదారులు వెనక్కి వచ్చే వరకూ దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి, వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు రాజు. దీంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంది దేవి. ఇది హైదరాబాద్‌లోని చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలోని అమ్మవారి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథల్లో ఒకటి.

భాగ్యలక్ష్మీ
పాత బస్తీకి చెందిన సాహితీవేత్త ఔదేష్ రాణి మరికొన్ని వివరాలు వెల్లడించారు. 1955-56లలో చార్మినార్ చుట్టూ చాలా లావుగా ఉండే ఇనుప గొలుసు ఉండేదట. చిన్న ముక్క అమ్మినా బోలెడు డబ్బు వచ్చేది. అలా జనం కొందరు ఇనుప తాడు దొంగిలించేవారట. హైదరాబాద్ జీరో మైలు రాయి అది. 1967లో ఒక బస్సు డ్రైవర్ ఆ రాయిని ఢీ కొడితే పగిలిపోయింది. వెంటనే ఆర్య సమాజ్ వారు వచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మీ దేవని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు పైపులు వాడి ఒక షెడ్ లాగా వేసేశారని వివరించారు.

ఇద్దరు అమ్మాయిలు
షెడ్ కట్టక ముందు అక్కడ ఇద్దరు అమ్మాయిలు భిక్షాటన చేసేవారు. వారు అక్కడే పసుపు, కుంకుమ వేసేవారు. ఈ గుడి కట్టాక వారిని పంపించేశారు. ఒక పూజారి వచ్చాడు. ఆ రాయి దగ్గర లక్ష్మీ దేవి ఫోటో పెట్టారు. ఆమె భాగ్యలక్ష్మీ అనీ హైదరాబాద్‌ను కాపాడటానికి వచ్చిందనీ చెప్పారు. కొన్ని రోజులకు ఆ ఫోటో బదులు విగ్రహం పెట్టారని వివరించారు. ఈ గుడి కట్టడంపై కొందరు కమ్యూనిస్టు నాయకులు అభ్యంతరం చెప్పినట్టు చెప్పుకొచ్చారు. అయిదారుగురు కమ్యూనిస్టు నాయకులు అసలు అక్కడ గుడి ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వారికి ఆసక్తికర విషయాలు తెలిశాయి. హైదరాబాద్‌లో వెట్టి చాకిరీ కోసం వచ్చి, రోడ్లు వేసే కూలి పనిచేసే ఒక మహిళను అదే ప్రదేశంలో పూడ్చి పెట్టారనీ, ఆమె పుణ్యస్త్రీగా చనిపోవడంతో ఆమె సమాధిపై పసుపు, కుంకుమ చల్లేవారనీ తెలిసింది. ఆమె కుమార్తెలే అక్కడ భిక్షాటన చేసే వారనే వాదన ఉంది. ఈ విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

వేరే గుడి ఉందట
చార్మినార్ పరిసరాల్లో భాగ్యలక్ష్మి గుడి లేదు కానీ, వేరే గుడి ఉందనీ, ఆ గుడి ఇప్పటికీ కొనసాగుతుందనీ చెప్పారు. మక్కా మసీదు దగ్గరలో శివాలయం ఉండేది. ఆలయం నిర్వహణకు పూజ సామాగ్రి ఖర్చులు కుతుబ్ షాహీ రాజులే ఇచ్చేవారు. దీనికి స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. పాతబస్తీలోని ఆలయాలకు రికార్డులు ఉన్నాయి. భాగ్యలక్ష్మి గుడి ఉన్నట్టు మాత్రం ఎక్కడా లేదని వివరించారు. విగ్రహం పెట్టక ముందు అక్కడ రాయి, ఫోటో ఉండేదనే విషయాన్ని చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి పూజారులూ చెప్పారు. ఆ రాయి పురాతనమైన అమ్మవారి రూపం అని విశ్వసిస్తారు.అమ్మవారిని 500 ఏళ్ల నుంచి ఆరాధిస్తున్నారని పూజారి సూర్యప్రకాశ్ తెలిపారు
Recommended Video

వెండి రూపాలు.. భక్తుల విశ్వాసం
ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర రెండు వెండి రూపాలు ఉంటాయి. ''ఆ వెండి తొడుగుల వెనుక ఆ పగిలిన రాయి ఉంది. పగిలిన రాళ్లకు పూజలు చేయకూడదు కాబట్టి, మొదట్లో ఫోటో పెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని వివరించారు. గుడి కట్టి 80-100 ఏళ్లు అవుతుందని చెప్పారు. నాలుగు తరాలుగా ఇక్కడే పూజ చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు. అస్ఘర్ అలీ ఇంజినీర్ రాసిన ''కమ్యూనల్ రాయిట్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా'' పుస్తకంలో చార్మినార్ దగ్గర ఘటనలను ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని 292వ పేజీలో ''ఈ గుడి ఈ మధ్య కాలంలో కట్టిందే అని ఉంది. 1965లో ఒక మినార్ దగ్గర ఒక రాయికి కాషాయం రంగు పూసి, అక్కడో ముసలామెకు అప్పజెప్పారు. ఆ తరువాత 1970లలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆ రాయిని ఢీ కొన్న సమయంలో ఒక పక్కా గుడిలా నిర్మించారు. ఆ డ్రైవర్ ముస్లిం కావడంతో అతడిని డిస్మిస్ చేశారని తెలిపారు. సో నేపథ్యం ఇలా.. భక్తులు మాత్రం దీపావళి సమయంలో నాణెం కోసం క్యూ కడుతుంటారు. ఆలయ నిర్వాహకులు పంపిణీ చేసే నాణెం తీసుకుంటే తమకు మంచి జరుగుతుందని.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications