Cyber Crime: 9 నెలల్లో రూ.100 కోట్లకు పైగా మోసపోయిన హైదరాబాదీలు..!
హైదరాబాద్ లో సైబర్ నేరగాలు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా మంది సైబర్ నేరగాళ్లకు చిక్కి లక్షల్లో నష్టపోతున్నారు. హైదరాబాద్ కు ప్రజలు నెలకు రూ.11 కోట్ల వరకు సైబర్ నేగాళ్ల చేతిలో మోసపోతున్నారని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ప్రజలను రకరకాల దారుల్లో మోసం చేస్తున్నారు. వాట్సాప్ లింకులు, రీల్స్, మెసేజ్ లు ద్వారా అమాయకులను ట్రాప్ లోకి లాగుతున్నాయి.
అంతేకాదు ఇంటర్ నెట్ ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు పెట్టి కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ కామర్స్, బ్యాంకు, ప్రభుత్వ సంస్థ సంబంధించి ఫేక్ పోర్టల్లతో మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు 27 అంశాలతో ప్రజలను మోసగిస్తున్నారు. హైదరాబాద్ లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సైబర్ క్రైమ్ పోలీసులు 2232 సైబర్ నేరాల కేసులు నమోదు చశారు. ఈ 9 నెలల్లో ప్రజలు రూ.10 కోట్లకు పైగా మోసపోయారు.

మోసపోయిన వారిలో ఎక్కువగా.. అధికంగా డబ్బు వస్తుందని ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టడం ద్వారా మోసపోతున్నారు. ఆ తర్వాత పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం నెట్ లో వెతుకుతూ మోసపోతున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన 1018 మంది రూ.69,60,48,689 కోల్పోయారు. గతంలో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇన్ స్టాగ్రామ్ లో కొందరు పరిచయమయ్యారు. వారు తమ వద్ద పార్ట్ జాబ్ ఉంది చేస్తార అని అడిగారు. ఏం ఉద్యోగమని మహిళ ప్రశ్నించింది.
యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే ఒక్కో వీడియోకు రూ.50 ఇస్తామని వారు చెప్పారు. దీంతో లైక్ రూ.50 వస్తాయని ఆశతో సదరు మహిళ వారు పంపిన వీడియోలకు లైక్ లు కొట్టుకు వెళ్లారు. దీనికి సంబంధించి అవతలి డబ్బు కూడా ఆమె ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆమెకు చెప్పారు. ఇది నమ్మిన మహిళ దాదాపు రూ.6 నుంచి రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత అవతలి వారి నుంచ కమ్యూనికేషన కట్ అయింది. దీంతో తాను మోసపోయినట్లు మహిళ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అధిక లాభాలు వస్తాయని ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టొద్దని పోలీసులు చెబుతున్నారు. ఏ వ్యాపారం చేసినా రానంత ఆదాయం కేవలం పార్ట్‌టైమ్ ఉద్యోగాలతో వస్తాయనగానే ప్రచారం నమ్మొద్దని కోరారు. ఆన్‌లైన్‌లో మోస పోయినట్టు గుర్తించగానే టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications