ఇళ్ల మధ్య పబ్: హైకోర్టులో పిటిషన్, 22వ తేదీన విచారణ..
ఇళ్ల మధ్య పబ్, బార్ల ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. పబ్, బార్ల ఏర్పాటుపై జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ హైకోర్టులో పిటిషన్ వేసింది. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌లతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్ ఏర్పాటు విధి విధానాలు తెలపాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యుసెన్స్ ఎక్కువయ్యిందని ఆందోళన చేపట్టారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 2, 3 గంటల వరకు పబ్ మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన తీవ్ర అబ్యంతకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొందరు యువకులు పబ్‌లో తాగేసి బాటిల్స్ ఇళ్లలోకి విసురుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లల్లో వృద్ధులు, పెద్ద వారు, చిన్న వారికి తలనొప్పిగా టాట్ పబ్ మారిందని చెప్పారు. గతంలో టాట్ పబ్‌లో రేవ్ పార్టీలు, అసభ్యకర నృత్యాలతోపాటు పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. వెంటనే పబ్‌ను ఇక్కడి నుండి తీసివేయాలి కోరారు.
నిజానికి ఇళ్ల మధ్య పబ్ ఏర్పాటు చేయడం ఇబ్బందికర పరిణామమే.. అంత ఎందుకు గుడి, బడికి దగ్గరలో వైన్ షాపు ఉండొద్దనే మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ వాటిని కూడా కొన్ని చోట్ల విస్మరిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కొన్ని చోట్ల వైన్ షాపులు ఉన్నాయి. దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. వాటికి సంబంధించి అక్కడివారు ఆందోళన చేపట్టి.. తర్వాత మిన్నకుండిపోయారు. మరీ టాట్ పబ్ గురించి అయినా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేదంటే అక్కడివారు రోజు నరకయాతన తప్పదు. 22వ తేదీన ప్రభుత్వం ఏం సమాధానం చెప్పనుందో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications