పెట్రో ధర తగ్గించింది కొంతే.. మంత్రి హరీశ్ రావు విమర్శలు

పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగానే తగ్గాయి. కానీ రాజకీయంగా మాత్రం దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. పెట్రో ధరల తగ్గింపుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. పెట్రోల్ పై పెంచింది బారాణా.. తగ్గించింది చారాణా సెటైర్లు వేశారు. 2014లో ఉన్న రూ.3.54 తగ్గించి అప్పుడు మాట్లాడాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదని హరీశ్ రావు తెలిపారు. డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చిన విధంగా మెల్లిగా ధరలు పెంచారని విమర్శించారు. ధరలు తగ్గించి చేస్తున్న ప్రకటనలు అన్నీ బోగస్ అన్నారు. పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గితే, డీజిల్ ధర రూ.7 వరకు తగ్గింది.

petro rates are decreased in low telangana minister harish rao alleges.

ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లపై ఈ సబ్సిడీ వర్తిస్తుంచనుంది. పెట్రో ధరల పెంపు.. సిలిండర్ ధర హైక్ గురించి విమర్శలు వస్తున్నాయి. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందిచింది. జనాలపై భారం పడుతోన్న నేపథ్యంలో సెస్సును భారీగా తగ్గించింది.

వాస్తవానికి ఇప్పుడు ఎన్నికలు లేవు. డిసంబర్‌లో గుజరాత్ ఎన్నికలు ఉంటాయి. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం తగ్గించిందా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ అందుకు దాదాపు 6 నెలల సమయం ఉంది. కానీ ఇప్పుడు పెట్రోల్ ధర తగ్గించడం ఏంటీ అనే ప్రశ్న సామాన్యుడి మదిలో మెదలుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+