Hyderabad: పుట్ట గొడుగుల బిర్యానీలో చికెన్ ముక్కలు..!
ఈ మధ్య హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల తీరు దారుణంగా ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేస్తున్నప్పటికీ రెస్టారెంట్లు, హోటళ్ల తీరు మారడం లేదు. కొన్ని రెస్టారెంట్లు ఒకటి ఆర్డర్ మరొకటి కూడా సర్వ్ చేస్తున్నాయి. తాజాగా కొంత మంది కార్తీకమాసం అని వెజ్ బిర్యానీ కోసం బాచుపల్లి పిస్తా హౌస్ కు వెళ్లారు.కస్టమర్లకు పుట్టగొడుగుల బిర్యానీ ఆర్డర్ చేశారు. రెస్టారెంట్ యాజమాన్యం మిగిలిపోయిన చికెన్ బిర్యానీలోనే పుట్టగొడుగులను సర్వ్ చేసింది.
వినియోగదారులు పుట్టగొడుగుల బిర్యానీలో చికెన్ ముక్కలు చూసి ఖంగుతిన్నారు. వినియోగదారులకు రూ.700 బిల్ కూడా వేశారు. వినియోగదారులు బిల్ చెల్లించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరారు. సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఈ సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పిస్తా హౌస్ రెస్టారెంట్ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు. కాగా.. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు.

రెస్టారెంట్లు, హోటళ్ల వంట గదుల్లో దారుణ పరిస్థితులు గుర్తించారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ కొద్ది రోజుల క్రితం రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్, మాసబ్ ట్యాంక్‌లోని దిన్ హిల్ హోటల్‌లో దారుణ పరిస్థితులను గమనించారు. వంటగదిలో పరిస్థితులపై రెస్టారెంట్, హోటల్ యజమానులకు విజయలక్ష్మి హెచ్చరిక జారీ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో విఫలమైన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార అందించడం హోటళ్లు, రెస్టారెంట్ల బాధ్యత అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో అందించే ఆహారం భద్రత, పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి రెగ్యులర్ తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి రేటింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు.
కార్తీకమాసం అని వెజ్ బిర్యానీకై పిస్తాహౌజ్ కు వెళ్లిన కస్టమర్లకు పుట్టగొడుగుల బిర్యానీ ఆర్డర్ చేస్తే.. మిగిలిపోయిన చికెన్ బిర్యానీలోనే పుట్టగొడుగులను సర్వ్ చేసింది బాచుపల్లి పిస్తాహౌజ్ బ్రాంచ్..!#KarthikaMaasam #PistaHouse #Bachupally #ViralVideos #Telangana pic.twitter.com/DxUbsM6wj9
— oneindiatelugu (@oneindiatelugu) November 17, 2024












Click it and Unblock the Notifications