పీకే జాన్ దోస్త్.. కొత్త పార్టీ రావొచ్చు, నేషనల్ పాలిటిక్స్‌లో కీ రోల్: కేసీఆర్

చాలా రోజుల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. వివిధ అంశాలపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ డిసెంబర్‌లో ఆయన ఎన్నికలకు వెళతారని.. అప్పుడు గుజరాత్ ఎన్నికలు ఉన్నందున.. మోడీ, షా పట్టించుకోరని కేసీఆర్ ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ముందస్తుకు వెళతారా అనే ఊహాగానాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదని కుండబద్ధలు కొట్టారు. ప్రశాంత్ కిశోర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు.

 అప్పుడు వేరే..

అప్పుడు వేరే..

గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ఇప్పుడా పరిస్థితులు లేవని కేసీఆర్ అన్నారు. తాము చేపట్టిన పనులు పూర్తి చేయడానికి సమయం సరిపోతుందన్నారు. గతంలో ఎన్నికలకు వెళ్లిన సమయంలో 88 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సారి 95 నుంచి 105 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. 30 సీట్లలో సర్వే చేశారని.. అందులో 29 స్థానాల్లో గెలుస్తామని తేలిందన్నారు.

ఆహ్వానిస్తేనే పీకే వచ్చారు..

ఆహ్వానిస్తేనే పీకే వచ్చారు..


ప్రశాంత్ కిశోర్‌ను తానే ఆహ్వానించానని కేసీఆర్ తెలిపారు. ఆయన తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్‌కు అనుభవం ఉందని.. 12 రాష్ట్రాల్లో పని చేసిన అతను డబ్బులు తీసుకుని పని చేసే వ్యక్తి కాదని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయనతో తాను చర్చలు జరుపుతున్నట్లు, ఐ ప్యాక్ సంస్థను నెలకొల్పాడని ఇందులో రహస్యం ఏముందున్నారు. దేశం కోసం పని చేస్తునప్పుడు తెలంగాణ కోసం పని చేయవద్దా ? అని ప్రశ్నించారు. దేశం గురించి ఆలోచించిన సమయంలో తెలంగాణ అంతర్భాగం కాదా ? అని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి తాను ప్రశాంత్ కిశోర్‌ను పిలవడం జరిగిందన్నారు.

 కొత్త పార్టీ రావొచ్చు

కొత్త పార్టీ రావొచ్చు


దేశంలో మార్పు అవసరం.. .కొత్త జాతీయ పార్టీ రావొచ్చు.. తమది బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ కాదు.. ప్రజల మేలుకోరే రాజకీయ ఫ్రంట్ అని కేసీఆర్ అన్నారు. అద్భుతంగా కొత్త రాజకీయ పార్టీ రావొచ్చని హింట్ ఇచ్చారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని మరోసారి తెలిపారు. యూపీఏ ప్రభుత్వం కంటే దారుణమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయని వెల్లడించారు. బీజేపీ పరిస్థితి దిగజారిపోతోందని, ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. 75 ఏళ్లలో చాలా సమస్యలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసుగు చెందితే.. బీజేపీకి పట్టం కట్టారన్నారు. 8 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా దేశంలో ఏమి జరగలేదన్నారు. కరెంటు, నీటిపారుదల, ఆర్థిక అభివృద్ధి.. ఏ రంగం అభివృద్ధి చెందిందా ? అని ప్రశ్నించారు.

కొలువుల భర్తీ ఏదీ..?

కొలువుల భర్తీ ఏదీ..?


15 లక్షల ఖాళీలను ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దేశం అర్థం చేసుకుందని, యూపీఏ కన్నా అధ్వాన్నంగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. యూపీలో ఎలాంటి ప్రచారం జరిగింది ? ఇలా ఎక్కడైనా ఉంటుందా అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. యువతకు ఉద్యోగాలు రావొద్దా ? పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావొద్దా ? దేశానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతలా అభివృద్ది చెందిందనే అంశాన్ని గుర్తుచేశారు. జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆ పార్టీని ఏకీపారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+