రకుల్ సోదరుడు అరెస్ట్..సంచలన విషయాలు వెలుగులోకి ..డ్రగ్స్ కేసులో ప్రముఖులు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం చోటు చేసుకుంది. సైబరాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈకేసులో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్‌సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా దీనిపై మీడియా సమావేశం నిర్వహించిన పోలీసులు.. డ్రగ్స్ కేసు తీవ్రతను వివరించారు.
నైజీరియా నుంచి డ్రగ్స్ వస్తున్నాయని సమాచారంతో చేపట్టిన తనీఖిల్లో భాగంగా భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుపడినట్టు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలియజేశారు. నైజారీయాకు చెందిన అనోహ బ్లెస్సింగ్ హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువస్తుందని ప్రాథమిక సమాచారంతోనే దాడి చేసినట్టు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నైజీరియాకు చెందిన యువతి అనోహ బ్లెస్సింగ్ ఫేక్ పాస్ పోర్టుతో ఇక్కడకు తరచు వచ్చి వెళ్తోందని గమనించిన తాము ఆమెపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన తెలియజేశారు. దీనిలో భాగంగానే ఆమె హైదరాబాద్‌కు డ్రగ్స్ వస్తోందని సమాచారంతో అనోహ బ్లెస్సింగ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అయితే డ్రగ్స్ కీలక సూత్రదారి అయిన ఏబుక సుజి పరారీలో ఉన్నారని,ఆయనపై రూ.20 లక్షల రివార్డు ఉందని డీసీపీ చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేసిన ఐదుగురు నుంచి శాంపిల్స్ తీసుకున్నామని, ఐదుగురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇక కేసులో దొరికిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు సైతం శాంపిల్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రముఖులు ఉండే అవకాశం ఉందని, విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications