Hyderabad: పోలీసుల కీలక నిర్ణయం.. గుళ్లల్లో భారీగా భద్రత పెంపు..!
హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య గుళ్ల వద్ద జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో భద్రత పెంచనున్నారు. హైదరాబాద్‌లోని ఆలయాల్లో 30 నుంచి 45 రోజుల బ్యాకప్ ఫుటేజీతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) వివిధ దేవాలయాలకు చెందిన 350 మంది ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ సమావేశం ప్రధానంగా రాబోయే పండుగ సీజన్లలో దేవాలయాలను సంరక్షించడానికి, ఆలయ భద్రత కోసం నిర్వహించారు.
24 గంటలు రక్షణ కోసం శిక్షణ పొందిన వాచ్‌మెన్‌లను నియమించాలని ఆలయ అధికారులను కోరారు. హైదరాబాద్‌లోని దేవాలయాల ప్రతినిధులకు కూడా చెత్త డబ్బాలను క్రమం తప్పకుండా ఖాళీ చేయడం, వీధి కుక్కలు, ఇతర జంతువులు ఆలయ ఆవరణలోకి రాకుండా, మాంసాహార అవశేషాలను వ్యాప్తి రాకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆలయ ప్రాంగణం గోడలపై మతపరమైన చిహ్నాలు లేదా చిత్రాలను ముద్రించకుండా చూడాలన్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించే వదంతులు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ నేరాలు, మహిళలపై నేరాలు, ముఖ్యంగా స్థానిక సంఘాలు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌ల వంటి వివిధ సామాజిక మాధ్యమాలపై అవగాహనతో ఉండాలని డీసీపీ కోరారు. సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించే ప్రజలు కూడా కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌లోని ఆలయ అధికారులు ఆలయాల ముందు ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పోలీసులను సంప్రదించడానికి ఆలయ ప్రాంగణంలో స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్, సెక్టార్ ఎస్‌ఐలు, ఎమర్జెన్సీ నంబర్ '100'తో సహా అత్యవసర సంప్రదింపు నంబర్‌లను ప్రముఖంగా ప్రదర్శించాలని కోరారు. ఆలయ అధికారులు వీధి నివాసితులపై ఒక కన్నేసి ఉంచాలన్నారు.అన్నదానం (ఉచిత ఆహార పంపిణీ) కార్యక్రమాలు జరిగే ప్రాంతాలకు సమీపంలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తుల గురించి పోలీసులకు తెలియజేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications