Hyderabad: నీలోఫర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..
హైదరాబాద్‌లోని నీలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి శిశువును కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. బేబీ సౌక్లైన్ సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను షాహీన్ బేగం (28), రేష్మా (30), అబ్దుల్లా (35)గా గుర్తించారు. జహీరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల గృహిణి హసీనాబేగం అక్టోబర్ 25న మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రోజు కామెర్లు ఉన్నట్లు(జాంటిస్) నిర్ధారణ కావడంతో చికిత్స కోసం శిశువును నీలోఫర్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
నవంబర్ 23న, హసీనా, ఆమె తల్లి డిశ్చార్జ్ కాగితాలపై సంతకం చేసే పనిలో ఉండగా బుర్ఖా ధరించిన ఒక మహిళ ఆసుపత్రి గురించి అంతా తెలుసని వారి వద్దకు వచ్చింది. మహిళ హసీనా తల్లి దృష్టి మరల్చడంతో, ఇతర నిందితులు శిశువును అపహరించి పారిపోయారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం నాంపల్లి పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.

హైదరాబాద్‌లోని ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, 44వ జాతీయ రహదారిపై కర్నూలు వైపు వెళ్తున్న అనుమానితుడి వాహనాన్ని గుర్తించారు.ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు స్థానిక అధికారులతో సమన్వయం చేసి కర్నూలు హైవేపై బృందాన్ని పంపించారు. నవంబర్ 24న జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద నిందితుడి వాహనాన్ని గద్వాల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం అడ్డుకుంది. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.
ముగ్గురు కుమార్తెలకు తల్లిదండ్రులైన అబ్దుల్లా, అతని భార్య రేష్మ మగబిడ్డ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కాన్పులో అమ్మాయి పుడితే ఎలా ఆలోచించి.. మగ శిశువును పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మగ శిశువును కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. రేష్మా చెల్లెలు షాహీన్ బేగం, అబ్దుల్లా నవంబర్ 23 న, అబ్దుల్లా, షాహీన్ బేగం నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ షహీన్ కొడుకు కనిపించాడు. తల్లి దృష్టి మరల్చి శిశువును కిడ్నాప్ చేశారు. అనంతరం కర్నూల్ పారిపోయే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications