హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితుల పోస్ట్‌మార్టమ్ ....ఆసుపత్రి నుండి నేరుగా శ్మశాానానికే....

|
Google Oneindia TeluguNews

దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించారు. సంఘటన స్థలం వద్దకే నలుగురు ఎక్జిక్యూటివ్ మేజీస్ట్రేట్స్‌ చేరుకుని పంచనామా నిర్వహించారు. సంఘటన తీరుపై అన్ని వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాలను మహబుబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.. అయితే అంతకుముందే.. వైద్యులు కూడ ఎన్ కౌంటర్ స్థలానికే చేరుకుని వైద్యపరంగా నిర్వహించాల్సి కార్యక్రమాలన్ని పూర్తి చేశారు. పోస్టు మార్టమ్ పూర్తయిన తర్వాత మృతదేహాలను ఇంటికి తీసుకుపోకుండా... నేరుగా స్మశానవాటికకు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.

దిశ నిందితుల పోస్ట్‌మార్టమ్

దిశ నిందితుల పోస్ట్‌మార్టమ్


దిశ కేసులో రిమాండ్‌లో నిందితులు ఉదయం ఎన్‌కౌంటర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సంఘటన స్థలానికి ఎమ్మార్వోలు చేరుకుని పంచనామా నిర్వహించారు. ఒక్కోక్కరి పంచనామా పూర్తి చేసేందుకు ఆలస్యం కానుండడంతో మొత్తం నలుగురి మృతదేహాలపై పంచనామా చేసేందుకు ఏకంగా నలుగురు ఎక్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ సంఘటనల స్థలానికి చేరుకుని, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షమంలో పంచనామా నిర్వహించారు.

 పోస్ట్ మార్టమ్ తర్వాత నేరుగా శ్మశానికే...

పోస్ట్ మార్టమ్ తర్వాత నేరుగా శ్మశానికే...

దిశ హత్యానంతరం నిందితులను ఉరి తీయాలంటూ.. దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. మరోవైపు వారి కుటుంబ సభ్యులు సైతం పూర్తిగా ఖండించారు. వారిని ఉరి తీసిన మాకు అభ్యంతరం లేదని ప్రకటించారు. దిశకు జరిగిన విధంగా వారికి జరగాలని స్పష్టం చేశారు. నిందితులకు పోస్ట్ మార్టమ్ పూర్తయిన తర్వాత నేరుగా వారికి ఇంటికి కాకుండా.. నేరుగా శ్మశానికే తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు కూడ అంగీకరిచినట్టు తెలుస్తోంది.

సంఘటన స్థలం వద్ద గుమికూడిన ప్రజలు

సంఘటన స్థలం వద్ద గుమికూడిన ప్రజలు

దిశ నిందితులు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరగడంతో ... ఉదయమే... మీడియా ద్వారా వార్త దావానంలా వ్యాప్తి చెందింది. దీంతో దేశ వ్యాప్తంగా పలువురు నేతలు , ప్రజలు తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నారు. అయితే ఇదే సంధర్భంలో సంఘటన జరిగి స్థలానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దిశ నిందితులను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మృతదేహాలను ఆసుపత్రికి తరలించకుండా... సంఘటన స్థలం వద్దే పోస్ట్ మార్టమ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

దిశ నిందితుల వద్దకే అన్ని విచారణలు...

దిశ నిందితుల వద్దకే అన్ని విచారణలు...


ముఖ్యంగా దిశ సంఘటన జరిగిన తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వెల్లువెత్తుతుంది. దీంతో వారిని తమకు అప్పగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేసి ఉంచిన షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో కోర్టులో ప్రోడ్యుస్ చేసే పరిస్థితి కూడ లేకపోవడంతో స్వయంగా జిల్లా జడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిందితుల వాదనలు విని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అనంతరం జైలుకు తరలిస్తున్న సమయంలో కూడ నిందితులను తీసుకువెళుతున్న బస్సులపై రాళ్లు, చెప్పులు విసిరిన పరిస్థితి కనిపించింది.

English summary
The post mortem was completed after an Encounter of Disha accused. Four executive magistrates reached the spot and held the Panchama then The doctors conducted a post-mortem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X