హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊరు ఎట్లా వెళ్లేది...? సమ్మెను సొమ్ము చేసుకుంటున్న ట్రావెల్ ఏజెన్సీలు

|
Google Oneindia TeluguNews

పండగవేళ తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు పేల్చిన సమ్మే బాంబుకు సామాన్యులు విలవిలలాడుతున్నారు. అయిదవ తేదీ నుండి సమ్మే చేస్తామని ఆర్టీసీ కార్మీకుల ఉమ్మడి ఐక్యకార్యచరణ కమిటీ ప్రకటించడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రెగ్యులర్‌గా తిరిగే బస్సులు బస్సులు కిటకిటలాడుతాయి. ఇదే సమయంలో కార్మీకులు సమ్మేకు దిగనుండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగాయి. దీంతో పండగలకు తమ స్వంత ఊళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు.

మూడింతలు పెరిగిన బస్‌చార్జీలు

మూడింతలు పెరిగిన బస్‌చార్జీలు

దసరా పండగ, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చుక్కలు చూపించే పరిస్థితిని తీసుకువస్తోంది. ఒవైపు పండగభారం మరోవైపు రవాణా భారం సామాన్యులకు తడిసి మోపడవుతోంది. ప్రభుత్వ పరంగా నడిపే బస్సుల్లో కూడ 50 శాతం రేట్లను పెంచడంతో ప్రవైట్ ట్రావెల్స్ వారికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. నష్టాలను భరించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుంటే అందివచ్చిన అవకాశాన్ని ప్రైవేట్ ట్రావెల్ ఎజెన్సీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో బస్సుచార్జీలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.

 ఏపీ ప్రయాణికులకు ఇబ్బంది

ఏపీ ప్రయాణికులకు ఇబ్బంది


అయితే ఆర్టీసీ సమ్మే వాతవరణం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందిద. హైదరాబాద్ నుండి సూదుర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఒక్కో కుటుంబానికి కనీసం 10 వేల రుపాయల వరకు అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ప్రత్యేక ట్రెయిన్లు వేసినా.. పరిస్థితి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరులకు మాములుగా బస్‌ టికెట్‌ 500 వరకూ ఉంటే.. దసరా పేరు చెప్పి రూ. 2000కు పైగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

సమ్మెతో ముందుగానే వెళుతున్న ప్రయాణికులు

సమ్మెతో ముందుగానే వెళుతున్న ప్రయాణికులు

తెలంగాణ జిల్లాల్లో పండగకు వెళ్లాలనుకునే వారు, సమ్మే కారణంతో రెండు రోజుల ముందుగానే తమ ప్రాంతాలకు వెళుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుండి సమ్మే చేస్తామని కార్మీక సంఘాలు చివరి హెచ్చరికను కూడ చేశాయి. దీంతో తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులు రద్దీగా మారాయి. మరోవైపు సమ్మేను విరమించాలని ఐఏఎస్‌ల కమిటీ కార్మీకులకు విజ్ఝప్తి చేసింది. ఒకవేళ సమ్మెకు వెళ్లినట్లయితే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. తొలగించిన కార్మీకులను విధుల్లో తీసుకునే అవకాశాలు ఉండవని అధికారులు హెచ్చరించారు. అయినా.. ఆర్టీసీ కార్మికుల ఐకాస మాత్రం సమ్మెను కొనసాగించేందుకే నిర్ణయించింది.

English summary
Private Bus fares are hike very high, because of telangana rtc strike from 5th october.travel agencies doubled the fares.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X