హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో కుండపోత వాన.. మరో 3 రోజులు, బయటకు రావొద్దు: వాతావరణ శాఖ

|
Google Oneindia TeluguNews

నిన్న, మొన్నటివరకు తెలంగాణ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. అప్పుడు హైదరాబాద్ మహానగరంలో ముసురు ఉంది. ఇప్పుడు గాలి ఇటు మళ్లింది. అందుకే శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.. మరో 3 రోజులు వానలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సజెస్ట్ చేస్తోంది.

 మళ్లీ వాన..

మళ్లీ వాన..

గత వారంలో నగర పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యలో నాలుగు రోజులు చినుకు పడలేదు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, నిజాంపేట, ప్రగతి నగర్, కోటి, ముసాపేట్, దిల్‌షుఖ్‌నగర్, వనస్థలిపురంలో మోస్తరు వర్షం పడుతుంది.

ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రామచంద్రాపురంలో 24 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కాప్రాలో 22, ఉప్పల్ లో 20, లింగంపల్లిలో 19, ముషిరాబాద్ లో 15 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నిన్న రాత్రి కూడా గ్రేటర్ పరిధిలో మోస్తరు వర్షం కురిసింది.

వరద ప్రవాహాం

వరద ప్రవాహాం


భారీ వర్షంతో గ్రేటర్ పరిధిలో రోడ్లపైకి భారీగా వరద ప్రవహిస్తోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామైంది. ఉదయం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం వరకు హైదరాబాద్‌ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అలర్ట్.. అలర్ట్...


భారీ వర్ష సూచనతో హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తం చేశారు. పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున రోడ్లపైకి రావొద్దని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దన్నారు. భారీ వర్షాలతో వరద నీరు రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు.

English summary
Rain alert:rain lashes in hyderabad city. water comes to some low area houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X