రెండురోజులు వానలు.. బలహీనపడ్డ అల్పపీడన ద్రోణి... అయినా...
తెలంగాణ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక అంతటా వ్యాపించాయి. ఆదివారం రాష్ట్రంలోని మెదక్, నల్గొండ జిల్లాల్లోకి విస్తరించాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
మధ్య ప్రదేశ్ నుంచి మరాఠ్వాడా తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మి వరకు ఉపరితల ద్రోణి వరకు వ్యాపించిన అల్పపీడన ద్రోణి బలహీనపడింది. మరాఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సోమవారం ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది.

తేలికపాటి జల్లులు కురవడంతో భూమి కాస్త చల్లబడింది. ఇలాగే వర్షాలు కురిస్తే అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. క్రమంగా చెరువులు, కుంటలు నిండుకుంటాయి. వర్షాధార పంటలకు వానలు ఇంపార్టెంట్.. దేశంలో చాలా మట్టుకు వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది. బావులు, మోటార్లు తక్కువ మంది రైతులకు ఉంటాయి.












Click it and Unblock the Notifications