హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరాన్ని వదలని వాన: మరోసారి భారీ వర్షం, జలమయమైన పలు కాలనీలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ను వర్షం వీడటం లేదు. నిత్యం వర్షం కురుస్తూనే ఉంది. ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెజార్టీ పీపుల్ ఊరికి వెళ్లిపోయారు. పండగ తర్వాత ఇవాళ, రేపు నగరానికి చేరుకోనున్నారు. వర్షం వల్ల పనులు జరగడం లేదని పలువురు అంటున్నారు.

హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వీడడంలేదు. సాయంత్రం సిటీని భారీ వర్షం ముంచెత్తింది. పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, షేక్ పేట, నాంపల్లి, గోల్కొండ, ఎస్సార్ నగర్, హైటెక్ సిటీ, మూసాపేట, మాదాపూర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

rain lashes in hyderabad city

వర్ష బీభత్సంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు నిలిచింది.

వర్షం పడటంతో ట్రాఫిక్‌కు తీవ్రంగా ఇబ్బంది ఎదురైంది. వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడా విస్తారంగా వానలు పడుతున్నాయి.

English summary
rain lashes in hyderabad city. people are troubled due to rain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X