Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపిస్ట్ రాజు చచ్చాడు: సింగరేణి కాలనీ వాసుల హర్షం, టపాసులు పేల్చి సంబురాలు

రేపిస్ట్ రాజు చచ్చాడు. ఆ కీచకుడు చనిపోతే తొలుత సింగరేణి కాలనీ వాసులు.. చిన్నారి పేరంట్స్ నమ్మలేదు. తమకు డెడ్ బాడీ చూపించాలని పట్టుబట్టారు. పోస్టుమార్టం చేయడం.. పోలీసు ఉన్నతాధికారులు కూడా వాడు చచ్చాడు అని చెప్పడంతో.. ఎట్టకేలకు విశ్వసించారు. ఇక కాలనీలో పండగ చేసుకున్నారు. నీచుడు చచ్చాడని వారంతా సెలబ్రేట్ చేసుకున్నారు.

హర్షం

హర్షం

చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన జనం భారీగా సింగరేణికాలనీకి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి కాలనీలో టపాసులు పేల్చి స్థానిక మహిళలు సంబురాలు జరుపుకున్నారు. వారం రోజుల నుంచి నిందుతుడి ఆచూకీ లభించకపోవడంతో బాధపడ్డం అని.. ఇప్పుడు చనిపోయాడని తెలియడం సంతోషంగా ఉందని అంటున్నారు. ఆ పాప ఆత్మకు శాంతి కలిగినట్టుగా ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

తగ్గని జనాగ్రహం

తగ్గని జనాగ్రహం


నిందితుడు రాజు చనిపోయినా...జన ఆగ్రహం తగ్గడం లేదు. వాడు చచ్చాడో లేదో తెలియదు కానీ...వాడి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావాలని కోరుతున్నారు. మరికొందరేమో చనిపోయింది అస్సలు రాజు కాదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోపంతో రగిలిపోయిన స్థానికులు అదే కాలనీలో ఉన్న రాజు ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో సింగరేణికాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు ఫెయిల్‌ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలను కూడా మార్చి ఇలాంటి నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు.

ప్రత్యక్ష సాక్షులు ఇలా

ప్రత్యక్ష సాక్షులు ఇలా

రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను తెలియజేశారు.ఇద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని వారు వివరించారు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

రాజు అని

రాజు అని

ఆ తర్వాత వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని వివరించారు. ఆ వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని డెడ్ బాడీని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. చేతిపై మౌనిక అనే పేరు కూడా ఉంది. చిన్నారి చనిపోయిన ఏడు రోజులకు కీచక నీచుడు రాజుకు కూడా అదేవిధంగా శిక్షపడింది. తనకుతానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

ఎన్ కౌంటర్ అని..?

ఎన్ కౌంటర్ అని..?

చిన్నారి ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో నేతలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒకడుగు ముందుకేసి చంపేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వాడిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచిపెట్టేదే లేదన్నారు. ఫ్యామిలీ వద్దకెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం అని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కానీ ఇంతలోనే రాజు పాపం పండింది.

పసిమొగ్గపై

పసిమొగ్గపై

ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు ఆకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో 9వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోననే అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడిపెట్టారు. రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంతలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను దొరికితే ఏం జరుగుతుందోనని ఊహించి ఉంటాడు. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+