రేపిస్ట్ రాజు చావు మంచిదే: నా బిడ్డ కూడా నరకయాతన, అత్త యాదమ్మ హర్షం
సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడికి రెండేళ్ల క్రితమే సూర్యాపేట జిల్లా జలాల్‌పురం గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆమె పేరునే రెండు చేతులపై రాజు పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఒక చేతిపై మౌనిక పేరు ఇంగ్లిష్‌లో, మరో చేతిపై తెలుగులో రాయించుకున్నాడు. రాజు భార్య ప్రసవం కోసం ఏడాది క్రితం జలాల్‌పురం వచ్చి అక్కడే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజు అత్తింటి వారిని కూడా వేధించేవాడని తెలిసింది. రెండు వారాల క్రితమే జలాల్‌పురం వెళ్లి మద్యం మత్తులో తన అత్తపై దాడి చేశాడు.

అత్త హర్షం..
ఇప్పుడు రాజు ఆత్మహత్యతో అతడి అత్త యాదమ్మ కూడా హర్షం వ్యక్తం చేసింది. తన కుమార్తె మౌనిక జీవితాన్ని రాజు నాశనం చేశాడని, ఇప్పుడు మరో బాలిక జీవితాన్ని కూడా నాశనం చేశాడని వాపోయింది. తన అల్లుడు రాజుకు బతికే హక్కులేదని, అతడు ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని ఆమె కామెంట్ చేసింది. తన కుమార్తె మౌనికకు రాజు వల్ల వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె తెలిపింది. 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో గొడవపడి రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని యాదమ్మ తెలిపింది. అప్పుడు తమ గ్రామం నుంచి వెళ్లిన రాజు మళ్లీ రాలేదని చెప్పింది. రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉండేవాడు.

రైల్వే కీ మెన్లు
రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను తెలియజేశారు.ఇద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని వారు వివరించారు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
ఇప్పుడు రాజు ఆత్మహత్యతో అతడి అత్త యాదమ్మ కూడా హర్షం వ్యక్తం చేసింది. తన కుమార్తె మౌనిక జీవితాన్ని రాజు నాశనం చేశాడని, ఇప్పుడు మరో బాలిక జీవితాన్ని కూడా నాశనం చేశాడని వాపోయింది. తన అల్లుడు రాజుకు బతికే హక్కులేదని, అతడు ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని ఆమె కామెంట్ చేసింది. తన కుమార్తె మౌనికకు రాజు వల్ల వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె తెలిపింది. 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో గొడవపడి రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని యాదమ్మ తెలిపింది. అప్పుడు తమ గ్రామం నుంచి వెళ్లిన రాజు మళ్లీ రాలేదని చెప్పింది. రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉండేవాడు.
Recommended Video

అతనే అని
ఆ తర్వాత వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని వివరించారు. ఆ వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని డెడ్ బాడీని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. చేతిపై మౌనిక అనే పేరు కూడా ఉంది. చిన్నారి చనిపోయిన ఏడు రోజులకు కీచక నీచుడు రాజుకు కూడా అదేవిధంగా శిక్షపడింది. తనకుతానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!

Click it and Unblock the Notifications