హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ .. పోలీసుల అదుపులో 90మంది యువతీయువకులు
హైదరాబాద్ శివారులో ఒక రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు . నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లో జరుగుతున్న రేవ్ పార్టీ పై దాడి చేసిన పోలీసులు పెద్ద సంఖ్యలో అబ్బాయిలు, అమ్మాయిలను అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు సంబంధించిన ఎస్ఓటీ పోలీసులకు అందిన సమాచారంతో దాడులు నిర్వహించి రేవ్ పార్టీ నిర్వహిస్తున్న తొంభై మంది యువకులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. 90 మంది యువకులతో పాటుగా ఈ పార్టీలో ఉన్న అమ్మాయిలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
సంస్థాన్ నారాయణపూర్ లో ఒక వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దాడి చేసిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. రేపటి నిర్వాహకులతో పాటు గా ఇందులో పాల్గొన్న యువకులను , యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారు ఎక్కడి నుంచి వచ్చారు ? ఎంత కాలం నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది ? ఎలా ఈ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు అన్నదానిపై విచారణ జరుపుతున్నారు.

90 మంది యువతీయువకులు అరెస్ట్ , 60 బైక్ లు , 20 కార్లు సీజ్
పోలీసులు దాడి చేసిన సమయంలో పదిమంది యువకులు అక్కడి నుంచి పరారైన ట్లుగా తెలుస్తుంది. పరారైన యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన యువకులతో పాటుగా యువతులను కూడా విచారిస్తున్న పోలీసులు, పార్టీ జరిగిన ప్రాంతంలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రేవ్ పార్టీ జరిగిన రిసార్ట్స్ వద్ద 60 బైక్ లను , 20 కార్లను సీజ్ చేసిన పోలీసులు ఘటనా స్థలంలో పెద్దమొత్తంలో ఇతర సామాగ్రి కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు.

హైదరాబాద్ శివారులో జోరుగా సాగుతున్న రేవ్ పార్టీలు
తప్పతాగి యువతీ యువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లుగా, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్టుగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీల కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది . ముఖ్యంగా హైదరాబాద్ నల్గొండ శివారు రిసార్ట్స్ లో, ఫామ్ హౌస్ లలో ఈ రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ రిసార్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications