చివరకు మిగిలేది.. ఆ ఆరుగురే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తెలంగాణలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఇదీ ఎవరూ ఔనన్న కాదన్న నిజం. సీఎం కేసీఆర్‌కు చివరకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌ను ట్రాక్టర్ పెట్టి దుంతాడట.. రా వచ్చి చూడు.. ఆరు ముక్కలు అవుతావంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

అవునా.. నరుకుతావా..?
నన్ను నరుకుతావా..? నన్ను బూతులు తిడతావా? నన్ను ఆరు ముక్కులు చేస్తావా..? అది కూడా నీ లక్కీ నంబర్.. సిండికేట్ నెంబర్ అంటూ ఎద్దేవా చేశారు.. చివరకు నీకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, తెలంగాణ ప్రజల కోసం తల నరికించుకోవడానికైనా నేను సిద్ధం అన్నారు బండి సంజయ్. రైతులు రోడ్లపై వరి ధాన్యం పోసుకొని చూస్తున్నారు.. వరి ధాన్యం కొంటావా? లేదా? స్పష్టం చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఆ బాధ్యత మాదే
దళితబంధు అమలను చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. దళితులకు పది లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని హెచ్చరించారు.. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని ప్రశ్నించిన ఆయన.. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నాం అన్నారు.. కేసీఆర్ మాటలకు భయపడే ప్రసక్తేలేదు.. పోరాటం చేస్తాం.. గద్దె దింపుతాం అంటూ హెచ్చరించారు.

నిప్పులు
ఇటు మరోవైపు వరిధాన్యం కొనలేమని కేంద్రమే రాష్ట్రాలకు లేఖ రాసిందని అంతకుముందు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత ఆయనదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వివరించారు.60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. వారేం చేయలేదని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తారని ఫైరయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆ పార్టీ కారణం కాదా అని అడిగారు.
Recommended Video

కోతలు వెతలు
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కరెంట్ షాక్‌లు, రైతు ఆత్మహత్యలు ఉండేవని దుయ్యబట్టారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తాం అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 10 రేట్లు పెంచామని గుర్తుచేశారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళకు దేశంలో తొలిసారిగా పింఛన్లు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. పైకి సుద్దులు మాత్రం చెబుతారని ఆయన పేర్కొన్నారు. చేతలు మాత్రం ఉండవని.. ఇవీ అందరికీ తెలుసు అని వివరించారు.












Click it and Unblock the Notifications