Hyderabad: తగ్గిన రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు..

హైదరాబాద్‌లో మార్చి 2024లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో భారీ తగ్గుదల నమోదు అయింది. దాదాపు 10 శాతం తగ్గింది. మార్చిలో మొత్తం 6,416 ఆస్తులు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ. 4,039 కోట్లుగా ఉంది. ఇది గత నెలతో పోలిస్తే 7శాతం తక్కువ. ఇవి హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి వివరాలు.

మార్కెట్‌లో రంగారెడ్డి జిల్లా 46 శాతం రిజిస్ట్రేషన్‌లతో అగ్రస్థానంలో నిలవగా, మేడ్చల్-మల్కాజిగిరి 40 శాతం, హైదరాబాద్ 14 శాతం మూడో స్థానంలో ఉంది. 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల మధ్య ఉన్న అపార్ట్‌మెంట్లు మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగించాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇవి 70 శాతంగా ఉన్నాయి. 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉన్న చిన్న గృహాల డిమాండ్ 16శాతానికి తగ్గింది.

Residential property registrations have come down drastically in Greater Hyderabad

2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న పెద్ద ఆస్తులపై ఆసక్తి 15శాతానికి పెరిగింది. ధరల విషయానికొస్తే మెజారిటీ ఆస్తి రిజిస్ట్రేషన్లు 45శాతం.. రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల మధ్య ధర ఉన్న ఇళ్లకు సంబంధించినవిగా ఉన్నవి. అయితే, రూ. 25 లక్షలలోపు ఆస్తులు షేర్‌లో క్షీణత కనిపించింది. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో కేవలం 14 శాతం మాత్రమే ఇవి ఉన్నాయి. మరోవైపు రూ. 1 కోటి కంటే ఎక్కువ ధర ఉన్న హై-ఎండ్ ప్రాపర్టీలు తమ వాటాను 16 శాతానికి పెరిగాయి. ఇది గత ఏడాది మార్చిలో 10శాతంగా ఉంది.

హైదరాబాద్‌లో లావాదేవీలు జరిపిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధర ఏడాది ప్రాతిపదికన 12శాతం పెరిగింది. మేడ్చల్-మల్కాజిగిరిలో అత్యధికంగా 13శాతం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వరుసగా 8%, 3% ధరలు పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+