Hyderabad: హైదరాబాద్ మియాపూర్‍లో దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..
హైదరాబద్ మియాపూర్ లోని ఆదిత్యనగర్ లో దారుణం జరిగింది. ప్రియురాలిని కత్తితో పొడిచిన ప్రియుడు సందీప్. కూతురుపై దాడిని అడ్డకునే ప్రయత్నం చేసిన తల్లిపై కూడా సందీప్ కత్తితో దాడి చేశాడు. యువతితో పాటు తల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు సందీప్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
రెండేళ్ల నుంచి
తల్లీకూతుళ్లను కొండాపూర్ కిమ్స్‌కు తరలించగా.. సందీప్ అలియాస్ బబ్లూను చికిత్స కోసం గాంధీకి తరలించినట్లు సమాచారం. సందీప్ ఏపీలోని రేపల్లెకు చెందినవాడిగా గుర్తించారు. బాధితురాలికి సందీప్ కు మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలిసింది. ఆమె రెండేళ్ల నుంచి బబ్లూని దూరం పెడుతూ వస్తోందని.. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేయడంతో సందీప్ ఆమె పగ పెంచుకన్నాడు.

6 నెలల క్రితం
6 నెలల క్రితం రేపల్లె నుంచి హైదరాబాద్ వచ్చిన బాధితురాలు ఆదిత్య నగర్ లో తన తల్లి, సోదరుడితో ఉంటోంది. మంగళవారం రేపల్లె నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సందీప్.. నేరుగా బాధితురాలితో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలోనే ఆమె కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications