తొలి టీకా తీసుకుంది ఈమెనే.. గాంధీలో వ్యాక్సినేషన్, పాల్గొన్న కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్

కరోనా వైరస్ రక్కసికి వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కాసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ప్రారంభించగా.. ఆయా చోట్ల టీకాలు అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. గాంధీ ఆస్పత్రిలో కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

Recommended Video

    COVID 19 Vaccination In Telangana : తొలి టీకా తీసుకున్న Krishnamma - ఫ్రంట్ లైన్ వారియర్స్...!!

    తెలంగాణ రాష్ర్టంలో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌రోనా టీకా ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన తర్వాత హైద‌రాబాద్‌ గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు. గాంధీ ఆస్ప‌త్రిలో స‌ఫాయి క‌ర్మ‌చారి ఎస్ కృష్ణ‌మ్మ క‌రోనా టీకా తీసుకున్నారు. ఈమెనే కరోనా టీకా తీసుకున్న తొలి వ్య‌క్తిగా రికార్డులోకి ఎక్కారు. టీకా తీసుకున్న తర్వాత ఆమెతో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమెను అబ్జ‌ర్వేష‌న్ గ‌దికి త‌ర‌లించారు.

    sanitation worker krishnamma took covid vaccine at gandhi hospital.

    ఇటు ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్‌లో గల కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఇక్కడ 30 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన కవిత్వాన్ని వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+