8 నుంచి స్కూళ్లకు హాలీడేస్.. లాక్‌డౌన్ లేదు: కేసీఆర్.. కానీ జాగ్రత్త

సంక్రాంతి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ నుంచి హాలీడేస్ ఉంటాయని తెలిపింది. 16వ తేదీ వరకు సెలవులు అని.. 17వ తేదీ సోమవారం నుంచి రాష్ట్రంలో గల అన్నీ విద్యాసంస్థలు పున: ప్రారంభం అవుతాయని పేర్కొంది. వైద్యారోగ్యశాఖపై సోమవారం సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రగతి భవన్‌లో జరిగిన రివ్యూలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి గురించి కూడా అధికారులతో డిస్కష్ చేశారు.

ఇటు లాక్ డౌన్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. లాక్ డౌన్ అవసరం లేదని.. అధికారులు నివేదిక అందజేశారని పేర్కొన్నారు. ఒమిక్రాన్ అంటే హడలెత్తిపోవద్దని సూచించారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్క్ విధిగా ధరించాలని సజెస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా రావడంతో హై టెన్షన్ నెలకొంది. అర్హులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84 ఒమిక్రాన్ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. 3 వేల 779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32 మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు.

school holidays start from 8th january

గత ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. తెలంగాణ మాత్రం కర్ఫ్యూ కూడా విధించబోమని చెబుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+