హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కేసుల టెన్షన్.. స్కూల్స్ రీ ఓపెన్‌పై ఎఫెక్ట్.. కీ డిషిషన్ తీసుకోనున్న సర్కార్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్కూల్స్ రీ ఓపెన్ అంశంపై క్లారిటీ లేదు. తెలంగాణలో 13వ తేదీ సోమవారం నుంచి స్కూల్ స్టార్ట్ అవ్వాలి. కానీ 15వ తేదీ అని అంటున్నారు. జూన్ ఆఖరు వరకు గతేడాది పాఠ్యాంశాలపై బోధన ఉంటుందట.. జూలై 1వ తేదీ నుంచి రెగ్యులర్ తరగతులు ఉంటాయి. కానీ కరోనా కేసులు పెరుగుతున్నందున స్కూల్స్ తెరవడంపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచిస్తోంది.

పెరుగుతున్న కేసులు..

పెరుగుతున్న కేసులు..

గత కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా విద్యా సంవత్సరంలో తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది. కానీ దీనిపై రీ థింకింగ్ చేస్తోంది.

కీ డిసిషన్..

కీ డిసిషన్..

కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు ఇంకా పెరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలు తెరుచుకోవడం కష్టమే అనిపిస్తోంది. దీనిపై తెలంగాణ సర్కారు త్వరలో ప్రకటన చేయనుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 155 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

చెప్పినట్టే జరుగుతుంది

చెప్పినట్టే జరుగుతుంది


ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు జూన్ 22వ తేదీ నుంచి ఫోర్త్ వేవ్ పీక్‌కు చేరుకుంటుందని అంచనా వేశారు. ఆ మేరకు కేసులు పెరుగుతున్నాయి. అందుకోసమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో స్కూల్స్ తెరవొద్దు అని అనుకుంటున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

English summary
schools reopen may be delayed in the telangana state sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X