డీఆర్డీఓ మిస్సైల్స్ ల్యాబ్ డైరెక్టర్‌గా ఉమ్మాలనేని అపాయింట్
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక డిఫెన్స్ రీసెర్చ్ అండ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) కీలక విభాగం ఏవియానిక్స్ ల్యాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా సీనియర్ సైంటిస్ట్ ఉమ్మాలనేని రాజబాబు నియమితులయ్యారు. ఇప్పటికే డీఆర్డీఓ ఛైర్మన్‌గా డాక్టర్ జీ సతీష్ రెడ్డి కొనసాగుతున్నారు. తాజాగా కీలకమైన ల్యాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా రాజబాబు అపాయింట్ కావడంతో ఇద్దరు తెలుగు సైంటిస్టులకు కీలక బాధ్యతలను అప్పగించినట్టయింది.
హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ ప్రధాన కేంద్రంగా డీఆర్డీఓ ప్రీమియర్ ఏవియానిక్స్ ల్యాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కొనసాగుతోంది. మిస్సైళ్ల విభాగానికి సంబంధించిన కీలక టెస్టింగులు ఇక్కడి నుంచే సాగుతుంటాయి. డీఆర్డీఓ అమ్ములపొదిలోని పలు కీలక మిస్సైళ్లు ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అగ్ని, పృథ్వి వంటి క్షిపణుల రీసెర్చ్, డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇక్కడి నుంచే నిర్వహిస్తుంటారు సైంటిస్టులు.

ఇటీవలే ఇండిజీనియస్ మిస్సైల్ నిర్భయ్ క్రూయిజ్ లాంగ్ రేంజ్ సబ్‌సోనిక్ క్షిపణిని కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లోనే రూపుదిద్దుకుంది. కొద్దిరోజుల కిందటే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు దీన్ని విజయవంతంగా పరీక్షించారు. తాజాగా- ఈ కీలక విభాగానికి సీనియర్ సైంటిస్ట్ ఉమ్మాలనేని రాజబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఓ విభాగం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుందనే విషయం తెలిసిందే.
డీఆర్డీఓ ఛైర్మన్‌గా ప్రస్తుతం జీ సతీష్ రెడ్డి కొనసాగుతున్నారు. అదే సమయంలో ఈ మిస్సైళ్ల విభాగం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్ డైరెక్టర్‌గా ఉమ్మాలనేని రాజబాబు అపాయింట్ కావడంతో ప్రతిష్ఠాత్మక డీఆర్డీఓకు తెలుగు సైంటిస్టులు సారథ్యాన్ని వహిస్తున్నట్టయింది.












Click it and Unblock the Notifications