హైదరాబాద్‌లో స్క్ర‌బ్‌ టైఫస్ విజృంభ‌ణ‌.. బాధితులంతా చిన్నారులే.. హడలెత్తుతున్న జనం

ప్రపంచాన్ని ఒక వైపు కరోనా, మరో వైపు ఒమిక్రాన్ వెంటాతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తితో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా నిండుకున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తితో జనాలు వణకిపోతున్నారు. ఈ టెన్షన్ చాలదన్నట్లు మరో కొత్త టెన్షన్ ప్రజలను వెంటాడుతుంది. భారత్‌లో ఇప్పుడు సబ్ టైఫస్ వ్యాది వణుకు పుట్టిస్తోంది.

హైదరాబాద్‌లో స్క్ర‌బ్ టైఫస్ వ్యాధి

హైదరాబాద్‌లో స్క్ర‌బ్ టైఫస్ వ్యాధి

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 213 కేసులు నమోదు అయ్యాయి. కొత్త వేరియంట్ కేసులు మహారాష్ట్రలో అత్యధికంగా 54 ఉండగా , 24 కేసులతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఒక పక్క ఒమిక్రాన్ భయం తెలంగాణ వాసులను వెంటాడుతుంటే తాజాగా ఈ కొత్త వ్యాధి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. హైదరాబాద్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి బయటపడింది. ఈ స్క్ర‌బ్ టైఫస్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది.

 బాధితులంతా చిన్నారులే..

బాధితులంతా చిన్నారులే..


ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి బాధితులంతా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంతున్నారు. ఇప్పటి వరకు 15 మంది ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ బాధితుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. ఈనెలలోనే నలుగురు పిల్లలు ఆస్పత్రిలో చేరార‌ని వెల్ల‌డించారు. వారిలో ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు వెద్యులు పేర్కొన్నారు.

 దేశంలోనూ స్క్రబ్ టైఫస్ కేసులు

దేశంలోనూ స్క్రబ్ టైఫస్ కేసులు

దేశంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ సబ్ టైఫస్ వ్యాధి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి సోకిన పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల యూపీలో కూడా చాలా మంది చిన్నారులు ఈ టైఫస్ వ్యాధి బారిన పడ్డారు . ఒడిశాలో కూడా దాదాపు 500 కేసులు నమోదయ్యాయి.

 పురుగుల కాటుతో వ్యాధి..

పురుగుల కాటుతో వ్యాధి..

స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ పరుగులు ఇళ్లలో మంచాలు,పెరటి మొక్కల్లో , తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. ఇవి చూడటానికి చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయని వైద్యులు తెలిపారు. ఇవి ఎక్కువగా రాత్రి సయమాల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు.

 వ్యాధి లక్షణాలు..

వ్యాధి లక్షణాలు..

ఈ స్క్ర‌బ్ టైఫస్ పురుగు కుడితే తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి , ఒళ్లు, కండరాల నొప్పులు ఉంటాయి , కొందరికి దద్దుర్లు వస్తాయి. పురుగు కాటుకు గురైన 10 రోజులలో ఈ లక్షణాలు ప్రారంభమవుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

 వ్యాధికి చికిత్స.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యాధికి చికిత్స.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధిని నివారించడానికి టీకాలు లేవని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( CDS ) పేర్కొంది. పురుగుల కాటుకు క్రమంగా ఇన్పెక్ష‌న్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఇన్పెక్ష‌న్ సోకిన వారితో సంబంధాలు నివారించడం ఉత్తమం. ఈ వ్యాధి సోకిన వారికి చేతులు, కాళ్లకు కప్పి ఉంచేలా దుస్తులును ధరింపచేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దొమ తెరలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు.

Recommended Video

    Omicron Virus : Hyderabad Airport And Telangana On High Alert || Oneindia Telugu
     స్క్రబ్ టైఫస్ అంటే..

    స్క్రబ్ టైఫస్ అంటే..


    స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. దీనిని బుష్ టైఫస్ అని కూడా పిలిస్తున్నారు. ఈ వ్యాధి పురుగుల కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ స్క్ర‌బ్‌ టైఫస్ బారిన పడినట్లయితే ఆ వ్యక్తికి యాంటీ బయాటిక్ డాక్సీసైక్లిన్ తో చికిత్స చేయాలని సూచించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+