హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి, కాళ్లు పట్టుకొని.. పవర్ కట్, సభ రద్దు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ శివారులో కొనసాగుతోంది. పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. రేపు రాష్ట్రానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా రానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాహుల్ గాంధీతో హైదరాబాద్ నగరంలో పాదయాత్రలో పాల్గొంటారు.

రాహుల్ పాదయాత్ర సందర్భంగా సోమవారం రోజున భద్రతా లోపం కనిపించింది. పాలమాకుల వద్దకు రాహుల్ పాదయాత్ర రాగానే.. ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటి మరీ.. వచ్చేశారు. రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నాడు. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. అతనిని బలవంతంగా బయటకు లాగారు. పోలీసుల తీరుపై రాహుల్ ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేశారు.

security fail: a person came rahul gandhi,

మరోవైపు ఇవాళ పెద్ద షాపూర్ వద్ద సభ జరగాల్సి ఉంది. అయితే యాత్ర కొనసాగే దారిలో పవర్ కట్ అయ్యింది. హైవే.. పరిసర ప్రాంతాలు చీకటిగా మారింది. దీంతో సభను రద్దు చేశారు.సభను ఆడ్డుకునేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. యాత్రకు వస్తోన్న స్పందనను చూసి.. ఓర్వడం లేదని అంటున్నారు.

రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది. ఇదివరకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉండేది. మోడీ సర్కార్.. ప్రధాని ఒక్కరికే ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి చట్ట సవరణ చేసింది. దీంతో దేశంలో ప్రధాని ఒక్కరికే ప్రొటెక్షన్ ఉండనుంది. మిగతా వారికి.. స్థాయిని బట్టి ఎన్‌ఎస్‌జీ కమోండోలు ప్రొటెక్షన్ ఇస్తారు.

English summary
person came rahul gandhi close. incident happened at palamakula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X