Hariharakrishna: తల, వేళ్లు, ఇతర భాగాలు బ్యాగులో వేసుకొని.. విస్తుపోయే నిజాలు..
హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తన ప్రేమకు నవీన్ అడ్డు వస్తున్నాడనే హరిహరకృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. హరిహరకృష్ణ నవీన్ హత్య చేసేందుకు 3 నెలల ముందే కుట్రపన్నాడు. 2 నెలల క్రితం మలక్ పేటలోని ఓ సూపర్ మార్కెట్‌లో హరిహరకృష్ణ కత్తి, గ్లౌజ్‌లు కొనుగోలు చేశాడు.

జనవరి 16న
జనవరి 16న హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్ స్నేహితుల సమావేశం తర్వాత హతమార్చాలని భావించాడు. కానీ, ఆ రోజు నవీన్ రాలేదు. దీంతో తన ప్లాన్ వాయిదా వేసుకున్నాడు. ఫిబ్రవరి 17న నవీన్ హైదరాబాద్ వచ్చాడు. ఆ రోజు మరో స్నేహితుతడు జీవన్ తో కలిసి హరిహరకృష్ణ, నవీన్ ఉప్పల్ లో సినిమా చూశారు. అనంతరం ఎల్బీనగర్ కు వెళ్లి భోజనం చేశారు. అక్కడి నుంచి జీవన్ వెళ్లిపోయాడు.

రాత్రి 9 గంటలకు
అనంతరం హరిహరకృష్ణ ముసారంబాగ్ లోని తన సోదరి ఇంటికి నవీన్ ను తీసుకెళ్లాడు. తాను కాలేజీ వెళ్లాలని నవీన్ చెప్పడంతో తాను డ్రాప్ చేస్తానని హరిహరకృష్ణ చెప్పాడు. దీంతో వారిద్దరు కలిసి రాత్రి 9 గంటలకు దిచక్ర వాహనంపై నల్గొండ పైపు వచ్చారు. హరిహరకృష్ణ అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కత్తి,గ్లౌజ్ బ్యాగులో వేసుకున్నాడు. పెద్దఅంబర్ పేటలోని వైన్స్ మద్యం కొనుగోలు చేసి తాగారు. అప్పుడే నవీన్ హరిహరకృష్ణ ఫోన్ నుంచి యువతికి ఫోన్ చేశాడు.

రాత్రి 11 గంటలకు
రాత్రి 11 గంటల ప్రాంతాలంలో ఔటర్ రింగ్ రోడ్డు దాటకా.. రాత్రి అయిపోయింది కాలేజీ ఏం వెళ్తావు.. రిటర్న్ వెళ్దాం పద అని నవీన్ ఒప్పించాడు. ఆ తర్వాత అమ్మాయి గురించి ముఖ్య విషయం చెప్పాలంటూ పొదల్లోకి తీసుకెళ్లిన గొంతు నులిమి హత్య చేశాడు. హత్య తర్వాత నవీన్ శరీరాన్ని హరిహరకృష్ణ ముక్కలు చేశాడు. తల, వేళ్లు, ఇతర భాగాలు బ్యాగులో వేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బ్రాహ్మణపల్లి వద్ద నవీన్ అవయవాలు పడేశాడు. ఆ తర్వాత స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నానం చేసి హత్య చేసిన విషయాన్ని హసన్ కు చెప్పాడు.

యువతికి ఫోన్
18వ తేదీ ఉదయం 10 గంటలకు యువతికి ఫోన్ చేసి పిలిపించాడు. హత్య విషయం ఆమెతో చెప్పాడు. తర్వాత వరంగల్‌లోని తండ్రికి దగ్గరికి వెళ్లాడు. 21వ తేదీ ఉదయం బైకుపై కోదాడకు వెళ్లాడు. అక్కడి నుంచి విజయవాడ, విశాఖపట్నంలకు బస్సులో పారిపోయాడు. 23వ తేదీ రాత్రి వరంగల్‌కు వచ్చి తండ్రికి విషయం చెప్పాడు. అనంతరం బ్రాహ్మణపల్లిలో స్నేహితుడు హసన్‌ను కలిశాడు. 24వ తేదీ సాయంత్రం
మిగిలిన శరీర భాగాలు సేకరించి దహనం చేసిన అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.

ప్రేమ
హరిహరకృష్ణ రెండో తరగతి చదువుతున్న సమయంలో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అతనికి అన్న, సోదరి ఉన్నారు. సోదరుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హరిహర ముసారాంబాగ్‌లో ఉంటూ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ చదివాడు. అక్కడే నవీన్‌తో పరిచయమైంది. ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనంతరం నవీన్ నార్కట్పల్లి మండలంలోని మహాత్మాగాంధీ వర్సిటీలో ఇంజినీరింగ్‌లో చేరాడు. హరిహరకృష్ణ పీర్జాదిగూడ అరోరా కళాశాలలో చేరాడు. ఈ క్రమంలో నవీన్ యువతికి మధ్య దూరం పెరిగింది. అదే ఆ యువతికి హరిహరకృష్ణకు మధ్య ప్రేమ ఏర్పాడింది. ఈ క్రమంలో నవీన్ సదరు యువతీకి ఫోనే చేస్తూ ఉండేవాడు.
తన ప్రేమకు అడ్డొస్తున్నాడని భావించిన హరిహరకృష్ణ అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications