పిస్తా హౌస్ హోటల్లో రౌడీషీటర్ల వీరంగం: యువకులపై దాడి, ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్‌లో పలువురు రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్ సామాగ్రితోపాటు పార్కింగ్ వద్ద బైకులను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బంది, యువకులపై దాడికి పాల్పడ్డారు. దీంతో యువకులు బయటకు పరుగులు తీశారు. మరోవైపు, పార్కింగ్ వద్ద హంగామా సృష్టించిన రౌడీషీటర్లు టూ వీలర్లను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడికి దిగారు.
Around 10 persons entered #PistaHouse restaurant under Attapur ps limits, @cyberabadpolice, #Hyderabad, at closing time & asked for food, while the kitchen was already closed. When denied food, they damaged the property & attacked the customers and created panic#Goons #Rowdism pic.twitter.com/r0HZCNLqo2
— Surya Reddy (@jsuryareddy) March 3, 2024
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. హోటల్లో మొత్తం 17 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చి దాడి చేశారు. రౌడీషీటర్ల బీభత్సంతో కస్టమర్లంతా భయాందోళనలకు గురయ్యారు. కాగా, దాడి ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యువతిపై అత్యాచారం, నగ్నవీడియోలు తీసి బెదిరింపు
ఓ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన యువకులు.. అంతటితో ఆగకుండా ఆమె నగ్నఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎల్బీనగర్ పీఎస్‌కు బదిలీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత డిగ్రీ విద్యార్థిని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో ప్రణవ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ కాలేజీ దగ్గర కలిసేవారు.
గత ఏడాది యువతి చదివే కాలేజీ వద్దకు వెళ్లి.. ఎల్బీనగర్‌లోని ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని బైక్‌పై తీసుకెళ్లాడు. ఇంటికి కాకుండా హోటల్‌కు తీసుకెళ్లి తాగునీటిలో మత్తమందు కలిపి ఇచ్చాడు. యువతి స్పృహ కోల్పోయాక ప్రణవ్, మరో యువకుడు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కోలుకున్న యువతి..భయపడి విషయం ఇంట్లో చెప్పలేదు.
రెండు నెలల క్రితం యువతి నివాసం బోరబండకు మార్చారు. అయితే, అత్యాచార విషయం ఎవరికీ చెప్పకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు మళ్లీ ఆమెకు ఫోన్ చేశారు. ఆమె నగ్న చిత్రాలు తమ వద్ద ఉన్నాయని, చెప్పినట్లు వినాలని బెదిరించారు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications