Rajeev Gandhi Airport: శంషాబాద్ ఎయిర్‍పోర్టుకు బాంబు బెదిరింపు.. !
హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ భద్రత తనిఖీలు చేపట్టారు. చివరికి బాంబు లేదని నిర్ధారించారు. దీంతో అందురు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారం ఇచ్చిన ఆగంతకుడి ఎవరో తెలుసుకునే పని లో పడ్డారు పోలీసులు. ఈ మధ్య విమానాశ్రయాల్లో, విమానాల్లో బాంబు పెట్టారంటూ ఫేక్ కాల్స్ చేయడం పెరిగిపోయింది.
ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో అందురు ఆగమయ్యారు. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఇండిగో విమానం కొచ్చి నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. ఇంతలో విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత విమానం మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాలకు బెంగళూరు వెళ్లింది. కాగా విమానంలో 139 ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

ఐదు రోజుల క్రితం ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో బాంబు పెట్టినట్లు ముంబై పోలీసులకు గత గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఒక విమానంలో బాంబు ఉందని ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్ అధికారులు కాల్ అందుకున్నారు. ప్రమాదం జరగకుండా ఆపడానికి బాలుడు పోలీసులు సాయం కూడా కోరాడని వివరించారు. దీంతో వెంటనే తనిఖీలు చేపట్టి బాంబు లేదని తేల్చారు. అయితే పోలీసులు ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు. సతారా జిల్లా నుంచి 10 ఏళ్ల బాలుడు కాల్ చేసినట్లు గుర్తించారు.
సదరు బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు తెలిసింది. ప్రస్తుతం బాలుడు ఓ వ్యాధికి చికిత్సు తీసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ గత ఆదివారం ముంబై విమానాశ్రయం నుంచి పోలీసులకు బూటకపు కాల్స్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని రుక్సార్ ముక్తార్ అహ్మద్‌గా గుర్తించారు. ముంబయి విమానాశ్రయంలో అరెస్టు చేసిన నిందితుడిని మాల్వాని పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications