హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

86 వేల కెమెరాలతో షూట్ చేసిన నో ప్రాబ్లం:లండన్, న్యూయార్క్‌లో పీసీ అయినా ఫర్లేదు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం టీఆర్ఎస్ సృష్టించిన నాటకమేనని కొట్టిపారేశారు. ఆ ఇష్యూపై ఎందుకు మాట మారుస్తున్నారని అడిగారు. తొలుత వంద కోట్లు అని.. ఆ తర్వాత రూ.15 కోట్లు అంటున్నారని గుర్తుచేశారు. తమ పార్టీకో విధానం ఉందని.. రాజీనామా చేసిన తర్వాత నేతలను చేర్చుకుంటామని తెలిపారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా తమ పార్టీలో చేరారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఫిరాయింపుల మాస్టర్ అని తెలియజేశారు.

విమానాలు కొని,

విమానాలు కొని,


ఆ నలుగురు తమ పార్టీలోకి వస్తే ఏంటీ.. రాకపోతే ఏంటీ అని అడుగుతున్నారు. ఎన్నికల కోసం కేసీఆర్ ఏ మాత్రం ఖర్చుచేస్తున్నారో తెలియడం లేదా అని అడిగారు. ఆయనకు కమీషన్లు వస్తాయని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ముడుపులు అందాయని విమర్శలు చేశారు. ప్రచారం కోసం విమానాలే కొంటున్నారని విరుచుకుపడ్డారు. ఆ అంశంతో తమ పార్టీకి ఏం సంబంధం లేదని చెప్పారు. మోసం చేయడం కేసీఆర్ నైజం అని పేర్కొన్నారు. రిమాండ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిందంటే అర్థం చేసుకోవాలని సూచించారు.

లండన్, న్యూయార్క్

లండన్, న్యూయార్క్


ఇవాళ ఢిల్లీలో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడతారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు కిషన్ రెడ్డితో తెలుపగా.. ఆయన ఎక్కడ పీసీ పెట్టుకున్న తమకు ఫరవాలేదని తెలిపారు. లండన్, న్యూయార్క్, వాషింగ్టన్.. అవసరమైతే పాకిస్థాన్‌‌లో లాహోర్‌లో పెట్టుకున్న ఫర్లేదు అని తెలిపారు. తాము తప్పుచేస్తే భయపడతామని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేశారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.

86 వేల కెమెరాలతో షూట్ చేసినా..

86 వేల కెమెరాలతో షూట్ చేసినా..


86 కెమెరాలతో షూట్ చేశారని తాను నిన్న చూశానని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. వారు 86 వేల కెమెరాలతో షూట్ చేసిన ఫరవాలేదని పేర్కొన్నారు. తాము భయపడం అని.. ఏ తప్పు చేయలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని తెలిపారు. కేసీఆర్ విఠాలాచార్య నాటకాలకు అదరబోం అని వివరించారు. ఫామ్ హౌస్ ఇష్యూపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని కోరారు. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూలో తొలుత కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపించాలని కోరారు. తమకు తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని.. కానీ ప్రభుత్వంపై లేదని చెప్పారు. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు.

English summary
shoot in 86 thousand cameras no problem central minister kishan reddy reacts on mlas issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X