హైదరాబాద్‌లో మరో విషాదం : అపార్ట్‌మెంట్ లాన్‌లో ఆరేళ్ల బాలుడు మృతి (వీడియో)
హైదరాబాద్ : నగర శివారు రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌గూడలో విషాదం చోటు చేసుకుంది. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని లాన్‌లో ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బిశాన్ శర్మ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. సిమెంట్ బెంచ్ పై కూర్చుని ఆడుకుంటుండగా అది విరిగి అతడిపై పడింది. తలకు బలమైన గాయం తగలడంతో బిశాన్ శర్మ స్పాట్ లో చనిపోయాడు.
బాలుడు మృతిచెందిన ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయింటెనెన్స్ సరిగా లేదంటూ కోపోద్రిక్తులయ్యారు. సిమెంట్ బెంచీలు విరిగిపోయి ఉన్నా.. పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రం నెలనెలా తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విరిగిపోయిన సిమెంట్ బెంచీ తొలగించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫిబ్రవరి నెల రెండో వారంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పీరంచెరువు పీబెల్ సిటీలో మోనీశ్ అనే ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. లాన్‌లో ఆడుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న పవర్ పోల్ పట్టుకున్నాడు. దాంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. బిల్డర్స్ నిర్లక్ష్యం వల్లే ఆ ప్రమాదం జరిగిందని అప్పట్లో పెద్ద దుమారం రేగింది.
హైదరాబాద్‌లో మరో విషాదం : అపార్ట్‌మెంట్ లాన్‌లో ఆరేళ్ల బాలుడు మృతి pic.twitter.com/oIZGBg0zhp
— Oneindia Telugu (@oneindiatelugu) April 26, 2019












Click it and Unblock the Notifications