TSRTC: హైదరాబాద్ మహిళలు తెగ వాడేస్తున్నారు.. 8 కోట్లకు చేరిన ఆర్టీసీ జీరో టికెట్లు..!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చింది. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అంతే కాదు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు భారీగా ఉపయోగించుకుంటున్నారు.

ఈ పథకం తీసుకొచ్చిన నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఇప్పటి వరకు 8 కోట్ల ఉచిత ప్రయాణ టికెట్లు జారీ చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. మొన్న సోమవారం రికార్డు స్థాయిలో 12 లక్షల మంది మహిళలు గ్రేటర్ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారు. బస్సుల సంఖ్య పెరిగితే మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. టికెట్ కు రూ.10 వెసుకున్న ఆర్టీసీకి రూ.80 కోట్ల ఆదాయం వస్తుంది.

So far 8 crore zero tickets have been issued in Greater Hyderabad

ఉచిత ప్రయాణంతో గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగినట్లు చెబుతున్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ లేనప్పుడు ఆక్యుపెన్సీ 70 శాతం మాత్రమే ఉండేదట. అయితే మహిళలు అవసరం లేకున్న బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని వల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. కొంత మంది మహిళలు కూరగాయలకు కూడా బస్సులో వెళ్లి వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఉచిత బస్సు ప్రయాణికి సంబంధించి పలు నిబంధనలు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగులకే పరిమితం చేయాలన్నారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఫ్రీ ఇచ్చినా.. 50 శాతం రాయితీ ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ సిటీ బస్సుల్లో టికెట్ రూ.10 వసూలు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల అవసరం ఉన్నవారే ఆర్టీసీలో ప్రయాణిస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+