Mahesh Babu: అంబానీతో పోటీపడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..ఇలా చేశాడేంటి..?
Mahesh Babu:ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు చాలామంది పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోతున్నారు. దీంతో వారి క్రేజ్ అమాంతంగా పెరిగిపోతోంది. పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక వీరు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా కొండెక్కి కూర్చుంటోంది.ఇక వీరి ఆస్తుల విషయానికొస్తే దేశవిదేశాల్లో ఈ టాలీవుడ్ టాప్ స్టార్స్‌కు ఆస్తులున్నాయి.
టాలీవుడ్ స్టార్లు కేవలం బిగ్ స్క్రీన్ పై కనిపించి మాత్రమే సంపాదించడం లేదు. పలు వ్యాపారాలు చేస్తూ కూడా సంపాదిస్తున్నారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో వీరంతా కుప్పలు కుప్పలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్క హైదరాబాదులోనే కాదు, ముంబై, గోవాలాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మాంచి ప్రాపర్టీ దుబాయ్‌లో కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయలో కళ్లు చెదిరిపోయే స్టన్నింగ్ విల్లాను కొనుగోలు చేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్త షికారు చేస్తోంది. మహేష్ బాబు ఈ విల్లాను ప్రముఖ బిల్డర్ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విల్లా రిజిస్ట్రేషన్ చేయించడంలో బిజీగా ఉన్నాడట ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్.
ఈ విల్లా దుబాయ్‌లోని ప్రైమ్ ఏరియాలో ఉండటంతో దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. పైగా సముద్ర తీరంకు అతి సమీపంలో ఉంటుందట. ఇక ఈ విల్లాలో ప్రిన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా ఇంటీరియర్ రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. అత్యంత కాస్లీ ఏరియాలో ఈ విల్లా ఉండటంతో ఫిల్మ్‌నగర్ మొత్తం ఇప్పుడు దీనిపైనే చర్చించుకుంటోందట.
ఇక మహేష్ బాబు ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే తను తీసుకునే రెమ్యూనరేషన్ క్రమంగా పెరిగిపోతోందట.త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న తన తాజా చిత్రానికి మహేష్ బాబు రూ.65 కోట్లు నుంచి రూ.70 కోట్లు తీసుకున్నట్లు జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. మొత్తానికి మహేష్ బాబు అటు ఆన్ స్క్రీన్ పై ఇటు ఆఫ్ స్క్రీన్ పై అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు.












Click it and Unblock the Notifications