హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజా సింగ్ భార్య సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైన గోషామహల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు టీ రాజా సింగ్‌ ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటోన్నారు. ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు. హైదరాబాద్ నగర పోలీసులు ఆయనపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజా సింగ్‌ను బీజేపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

 ఉల్లంఘనలు..

ఉల్లంఘనలు..

తొలుత అరెస్టయిన ఆయనకు బెయిల్ లభించినప్పటికీ- అనంతరం పోలీసులు పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడాన్ని ఆయన భార్య టీ ఉష బాయి సవాల్ చేశారు. ఈ మేరు ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 కింద ఈ పిటిషన్‌ దాఖలైంది. పీడీ యాక్ట్‌ కింద తన భర్తపై కేసు నమోదు చేస్తోన్న సమయంలో హైదరాబాద్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించారు.

సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలు..

సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలు..

సుప్రీంకోర్టు, హైకోర్టు జారీ చేసిన సూత్రాలు, మార్గదర్శకాలను పాటించలేదని ఉష బాయి వాదించారు. తన భర్తను పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకోవడానికి సిఫారసు చేసిన సంబంధిత పత్రాలు హిందీలో లేవని పేర్కొన్నారు. నిర్బంధానికి గురైన వ్యక్తి మాతృభాషలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను ప్రచురించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు గుర్తు చేస్తోన్నాయని అన్నారు. అడ్వైజరీ కమిటీ ముందు లిఖితపూరక సమాధానం ఇవ్వడానికి హైదరాబాద్ పోలీసులు తనకు అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

గూండాగా

గూండాగా


తన భర్త రాజా సింగ్‌ను గూండాగా పోలీసులు అభివర్ణించడం పట్ల ఉష బాయి అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో ప్రమాదకరమైన కార్యకలాపాలకు పాల్పడకుండా అనే పదాలను చేర్చారని, ఇది అసంబద్ధం, చట్టవిరుద్ధమని ఆమె తన పిటీషన్‌లో పొందుపరిచారు. కొంతమంది వ్యక్తులను సంతృప్తిపరిచడానికే తన భర్తపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించినట్లు ఉష బాయి పేర్కొ్నారు. వారిని శాంతింపజేయడానికే తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, ఇందులో ఇతర కారణాల వల్ల కాదని ఆమె వ్యాఖ్యానించారు.

 పోలీసు యంత్రాంగం విఫలం..

పోలీసు యంత్రాంగం విఫలం..

తన భర్తపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం రాష్ట్ర పోలీసు అధికారుల అసమర్థతకు కూడా అద్దం పట్టిందని ఆరోపించారు. శాంతిభద్రతలను నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం మొత్తం విఫలమైనట్లు తాను భావిస్తున్నానని ఉషా బాయి అన్నారు. రాజా సింగ్‌ను కిందటి నెల ఆగస్టు 23వ తేదీన మొదటిసారి అరెస్టు చేశారు. అదే రోజు ఆయనకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం పోలీసులు అదేనెల 26వ తేదీన పీడీ యాక్ట్ కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

English summary
Suspended BJP MLA Raja Singh's wife files petition in Telangana HC challenging PD Act against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X